ఈ రోజుల్లో జడ్జీలు ‘జ్యుసీ గాసిప్స్’ (అర్థం పర్థంలేని గాసిప్స్( కి బాధితులుగా మారుతున్నారని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. వి.రమణ అన్నారు. ఒక న్యాయమూర్తి జీవితం ఇతరుల లైఫ్ కన్నా మెరుగైనదేమీ కాదని ఆయన పేర్కొన్నారు. న్యాయమూర్తులు విలాసవంతమైన భవనాల్లో ఖరీదైన జీవితం అనుభవిస్తుంటారన్నవి అపోహలు మాత్రమే.. మా సొంత అభిప్రాయాలు వెలువరించడానికి కూడా కొన్ని పరిమితులు అడ్డు వస్తుంటాయి అన్నారాయన. విమర్శలకు మేం సాఫ్ట్ టార్గెట్లుగా మారుతున్నాం అని అన్నారు. మా కుటుంబ సభ్యులు కూడా త్యాగాలు చేయాల్సి ఉటుందన్నారు. లాయర్ ప్రశాంత్ భూషణ్ కోర్టు ధిక్కరణ కేసు నేపథ్యంలో జస్టిస్ రమణ ఇలా ఆవేదనగా మాట్లాడారు. సుప్రీంకోర్టు మాజీ జడ్జి ఆర్.భానుమతి రచించిన ‘జుడీషియరీ..జడ్జ్ అండ్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్’ పేరిట రాసిన పుస్తకావిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడారు. అటు-జడ్జీల భావప్రకటనా స్వేఛ్చకు కూడా కొన్ని సంకెళ్లు ఉన్నాయి అని సీజేఐ జస్టిస్ ఎస్.ఏ. బాబ్డే సైతం ఇలాగే మాట్లాడడం విశేషం.