Kailash Mansarovar Yatra: మానస సరోవర్ యాత్ర వయా లిపులేఖ్.. కొత్త మార్గంతో భారీగా తగ్గనున్న సమయం: రక్షణ మంత్రి
కైలాస పర్వతంలోని మానస సరోవరానికి త్వరగా చేరుకోవాలనే భక్తులకు రాజ్ నాథ్ సింగ్ గుడ్ న్యూస్ తెలిపారు. కైలాస మానసరోవర యాత్రకు కొత్త రహదారిని సిద్ధం చేశారు.

Kailash Mansarovar Yatra: కైలాస పర్వతంలోని మానస సరోవరానికి త్వరగా చేరుకోవాలనే భక్తులకు రాజ్ నాథ్ సింగ్ గుడ్ న్యూస్ తెలిపారు. కైలాస మానసరోవర యాత్రకు కొత్త రహదారిని సిద్ధం చేశారు. టిబెట్‌లోని కైలాస మానససరోవరానికి చేరుకోవడానికి టిబెట్, ఉత్తరాఖండ్ సరిహద్దులో ఉన్న లిపులేక్ నుంచి నూతన రహదారిని ఏర్పాటు చేశారు. ఈ నూతన మార్గం ద్వారా కైలాస మానసరోవర యాత్రకు చేరుకోవడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. దీంతో త్వరగా అక్కడికి చేరుకోవచ్చు. అయితే మే 6న ఈ రహదారిని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వర్చువల్‌గా ప్రారంభించారు. అయితే బుధవారం ఇక్కడి గునియాల్ గ్రామంలో నిర్మిస్తున్న సైనిక మందిరానికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ రహదారిపై మరోసారి ట్వీట్ చేసి ఈ విషయాన్ని వెల్లడించారు.
ఇందులో ఆయన టిబెట్‌ను ప్రస్తావిస్తూ, టిబెట్‌తో మనకు కూడా భావోద్వేగ సంబంధాలు ఉన్నాయని, అయితే నేడు పరిస్థితి మారిపోయిందని అన్నారు. అయితే, ప్రస్తుతం లిపులేఖ్ మీదుగా మానస సరోవర్ యాత్రకు వెళ్లేందుకు మార్గం సుగమమైందని, దీంతో యాత్రికుల సమయం చాలా ఆదా అవ్వనుందని ఆయన పేర్కొన్నారు.
అలాగే భారత్, నేపాల్ మధ్య సంబంధాలను చెడగొట్టాలని కొన్ని శక్తులు భావిస్తున్నాయని, అయితే ఈ బంధాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ విచ్ఛిన్నం చేసేందుకు భారత్ అనుమతించబోదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అయితే ఇందులో చైనా పేరు ప్రస్తావించకుండా ఆయన ఘటుగా సమాధానమిచ్చారు.
యుద్ధంలో విజయం సాధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా (డిసెంబర్ 16) రక్షణ మంత్రి అభినందనలు తెలుపుతూ సరిగ్గా 50 ఏళ్ల క్రితం 1971లో ఇదే రోజున భారత్-పాక్ మధ్య ఒప్పందం కుదిరిందని తెలిపారు. భారత సైనికుల పరాక్రమం కారణంగా 93 వేల మంది పాకిస్తాన్ సైనికులు భారత సైన్యానికి లొంగిపోయారని ఆయన తెలిపారు.
उत्तराखण्ड की सीमाएं नेपाल और तिब्बत से लगती है। नेपाल के साथ भारत के अच्छे संबंध है। तिब्बत के क्षेत्र में ही कैलाश मानसरोवसर स्थित है। कैलाश मानसरोवर की यात्रा के लिए हमने लिपुलेख के रास्ते एक नया यात्रा मार्ग तैयार किया है। इस रास्ते के खुल जाने के कारण समय की बचत होगी: RM
— रक्षा मंत्री कार्यालय/ RMO India (@DefenceMinIndia) December 15, 2021
Also Read: Petrol Diesel Price Today: స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. మెట్రో నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..