JNU Campus: మేం వస్తున్నాం మీరు పారిపోండి.. ఢిల్లీ జెఎన్‌యూలో గోడలపై బ్రాహ్మణ వ్యతిరేక రాతలు..

జెఎన్‌యులోని గోడలపై "బ్రాహ్మణులు క్యాంపస్‌ను వదిలివెళ్లారు", "బ్రాహ్మణుడి రక్తం", "బ్రాహ్మణ భారత్ చోడో", "బ్రాహ్మణ-బనియాలు, మేము మీ కోసం వస్తున్నాం! మేము ప్రతీకారం తీర్చుకుంటాము" ఇలాంటి రాతలు ఢిల్లీలొని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంగోడలపై కనిపిస్తున్నాయి.

JNU Campus: మేం వస్తున్నాం మీరు పారిపోండి.. ఢిల్లీ జెఎన్‌యూలో గోడలపై బ్రాహ్మణ వ్యతిరేక రాతలు..
Jnu Campus

Updated on: Dec 02, 2022 | 10:43 AM

ఢిల్లీ ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం జవహర్‌లాల్ నెహ్రూ క్యాంపస్ క్యాంపస్‌ (జెఎన్‌యూ) కాలేజ్ క్యాంపస్‌లో మరో వివాదం తెరపైకి వచ్చింది. వర్సటీలోని గోడలపై బ్రాహ్మణ వ్యతిరేక రాతలు కనిపించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. గోడలపై బ్రాహ్మణ వ్యతిరేక నినాదాలు గురువారం క్యాంపస్‌లోని బ్రాహ్మణులు క్యాంపస్ విడిచిపెట్టి పోవాలంటూ  బెదిరింపు రాతలు కనిపించాయి. తాము వస్తున్నామని.. వెంటనే జెన్‌యూను విడిచిపెట్టాలని వార్నింగ్ ఇచ్చారు గుర్తు తెలియని విద్యార్థులు.  వర్శిటీ అధికారులు ఈ ఘటనను ఖండిస్తూ, జెఎన్‌యూ క్యాంపస్‌ను అపవిత్రం చేయడం వెనుక కొన్ని జాతి వ్యతిరేక శక్తులు ఉన్నట్లుగా వర్శిటీ అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై వెంటనే విచారణ మొదులు పెడుతున్నారు.

ఇంటర్నేషనల్‌ స్టడీ బిల్డింగ్‌-2 దగ్గర పలు రూమ్స్‌పై ఇలాంటి నినాదాలు కనిపించాయి. లిటరేచర్‌ డిపార్ట్‌మెంట్‌ గోడలపైన, కొందరు ప్రొఫెసర్ల రూమ్స్‌ డోర్లపైన కూడా ఈ రాతలు ఉన్నాయి.  నళిన్ కుమార్ మహాపాత్ర, రాజ్ యాదవ్, ప్రవేశ్ కుమార్, వందనా మిశ్రాతో సహా పలువురు బ్రాహ్మణ ప్రొఫెసర్‌ల ఛాంబర్‌ల గోడపై ‘గో బ్యాక్ టు శాఖ’ అని రాసి ఉంది. ఈ రాతల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ‘బ్రాహ్మణుల జీవితాలు ముఖ్యం’ అనే ట్రెండ్ మొదలైంది.

బ్రాహ్మణులతోపాటు కొన్ని చోట్ల వైశ్యులను కూడా టార్గెట్ చేశారు. బ్రాహ్మణ్‌-బనియా మీ కోసం వస్తున్నాం క్యాంపస్‌ విడిచి వెళ్లండి అంటూ గోడలపై రాశారు. ‘బ్రాహ్మిణ్‌ భారత్‌ చోడో’ వ్యాఖ్యలు కూడా అక్కడక్కడా కనిపించాయి. ఇదంతా చూస్తుంటే నలుగురు ఫాకల్టీ స్టాఫ్‌ను టార్గెట్‌గా చేసుకుని ఇలాంటివి రాసినట్టు అర్థమవుతోందంటున్నారు. వైస్‌చాన్సలర్‌ ప్రొఫెసర్‌ శాంతిశ్రీ దీనిపై దర్యాప్తునకు ఆదేశించారు. ఈ వివక్ష పూరిత రాతల్ని లెక్చరర్స్‌ యూనియన్‌ ఖండించింది.

 

క్యాంపస్‌లో ఈ రాతల్ని ఏబీవీపీ ప్రతినిధులు ఖండించింది. లెఫ్ట్‌ అనుబంధ సంఘాల విద్యార్థి విభాగాలపై విమర్శలు గుప్పించారు. స్కూల్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ స్టడీస్‌ గోడలపై ఈ తరహా రాతలతో లబ్ది పొందాలనుకున్నది ఎవరు.. క్యాంపస్‌లోకి కులాల్ని లాగడం ద్వారా నెక్స్ట్‌ ఏం జరగబోతోంది అనేది హాట్‌ టాపిక్ అయ్యింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం