AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చెప్పులు వేసుకుని స్కూల్‌కు వచ్చిందనీ.. చెంపపై కొట్టిన ప్రిన్సిపాల్‌! విద్యార్థిని మృతి

Slapped By Principal Student Dies: ఓ విద్యార్ధిని చెప్పులు వేసుకుని స్కూల్‌కి వచ్చింది. గమనించిన ప్రిన్సిపల్‌ అందరి ముందే విద్యార్థిని చెంపపై లాగిపెట్టి కొట్టింది. దీంతో అవమానంగా భావించిన విద్యార్ధిని డిప్రెషన్‌లోకి వెళ్లి.. సూసైడ్‌ చేసుకుని మృతి చెందింది. బాలిక మరణించడంతో ఆగ్రహించిన ఆమె కుటుంబ సభ్యులు పాఠశాలపై దాడి..

చెప్పులు వేసుకుని స్కూల్‌కు వచ్చిందనీ.. చెంపపై కొట్టిన ప్రిన్సిపాల్‌! విద్యార్థిని మృతి
Slapped By Principal For Wearing Slippers To School
Srilakshmi C
|

Updated on: Oct 15, 2025 | 6:05 PM

Share

రాంచీ, అక్టోబర్ 15: ఓ విద్యార్ధిని చెప్పులు వేసుకుని స్కూల్‌కి వచ్చింది. గమనించిన ప్రిన్సిపల్‌ అందరి ముందే విద్యార్థిని చెంపపై లాగిపెట్టి కొట్టింది. దీంతో అవమానంగా భావించిన విద్యార్ధిని డిప్రెషన్‌లోకి వెళ్లి.. సూసైడ్‌ చేసుకుని మృతి చెందింది. బాలిక మరణించడంతో ఆగ్రహించిన ఆమె కుటుంబ సభ్యులు పాఠశాలపై దాడి చేశారు. తమకు న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ షాకింగ్‌ ఘటన జార్ఖంగ్‌లో వెలుగు చూసింది. అసలేం జరిగిందంటే..

జార్ఖండ్‌లోని గర్హ్వా జిల్లా బార్‌గఢ్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో దివ్య కుమారి అనే బాలిక 12వ తరగతి చదువుతుంది. సెప్టెంబర్ 15న ఆ విద్యార్థిని బూట్లకు బదులుగా చెప్పులు ధరించి స్కూలుకు వచ్చింది. అసెంబ్లీకి అలాగే హాజరైంది. స్కూల్‌ ప్రిన్సిపాల్ (ఇన్‌చార్జ్) ద్రౌపది మింజ్ డ్రెస్‌ కోడ్‌ పాటించనందుకు ఆమెను అందరి ముందు తిట్టింది. అంతేకాకుండా బాలికను చెంపదెబ్బ కొట్టింది. ఈ సంఘటన తర్వాత విద్యార్థిని దివ్య తొలుత బాగానే కనిపించినా.. ఆ తర్వాత ఆమె డిప్రెషన్‌కు గురైంది. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు డాల్టన్‌గంజ్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఆక్కడ దివ్యకు ప్రాథమిక చికిత్స అందించిన ఆ తర్వాత రాంచీలోని రిమ్స్‌కు రిఫర్‌ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ దివ్య అక్టోబర్‌ 14న మరణించింది. విద్యార్థిని దివ్య మరణానికి స్కూల్‌ ప్రిన్సిపాల్ మానసిక వేధింపులు కారణమని ఆమె తల్లిదండ్రులు బార్‌గఢ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఆగ్రహించిన బాలిక కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆమె మృతదేహాన్ని తెహ్రీ భండారియా చౌక్ వద్ద ప్రధాన రహదారిపై ఉంచి పాఠశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రిన్సిపల్‌ మానసిక హింస కారణంగానే దివ్య మరణించిందని నిరసనకారులు చేస్తూ, ఆమెను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. 3 గంటలకు పైగా రోడ్డుపై దర్నా చేయడంతో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు, జిల్లా అధికారులు అక్కడకు చేరుకుని ఆందోళన కారులను సముదాయించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో విద్యార్థిని మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించారు. ఈ విషయంపై మాట్లాడటానికి ప్రిన్సిపాల్ నిరాకరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.