Jharkhand Ropeway Accident: త్రికూట పర్వతాల్లో ముగిసిన రెస్క్యూ ఆపరేషన్.. నలుగురి మృతి.. ప్రాణాలతో బయటపడిన 40 మంది..

Jharkhand: ఝార్ఖండ్‌లోని డియోఘర్‌ జిల్లాలోని రోప్‌వే కేబుల్ కార్‌ ప్రమాద ఘటనకు సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ మంగళవారం మధ్యాహ్నంతో ముగిసింది.

Jharkhand Ropeway Accident: త్రికూట పర్వతాల్లో ముగిసిన రెస్క్యూ ఆపరేషన్.. నలుగురి మృతి.. ప్రాణాలతో బయటపడిన 40 మంది..
Jharkhand Ropeway Accident
Follow us

|

Updated on: Apr 12, 2022 | 4:07 PM

Jharkhand: ఝార్ఖండ్‌లోని డియోఘర్‌ జిల్లాలోని రోప్‌వే కేబుల్ కార్‌ ప్రమాద ఘటనకు సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ మంగళవారం మధ్యాహ్నంతో ముగిసింది. దాదాపు 45 గంటలకు పైగా కేబుల్ కార్లలో గాలిలో చిక్కుపోయిన 40 మందికి పైగా టూరిస్టులను రెస్క్యూ ఆపరేషన్ ద్వారా రక్షించారు. కాగా ఝార్ఖండ్‌లోని ప్రఖ్యాత త్రికూట పర్వతాల్లో తీగల మార్గంలో సంభవించిన ప్రమాదంలో మంగళవారం మరో అపశ్రుతి చోటుచేసుకుంది. సహాయకచర్యల్లో భాగంగా తాడు తెగడంతో ఓ మహిళ కిందిపడి మరణించింది. దీంతో ఈ ప్రమాదంలో మొత్తం మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ప్రమాదం కారణంగా ఇద్దరు మరణించగా.. సహాయక చర్యలు చేపడుతుండగా మరో ఇద్దరు చనిపోయారు. రాగా రెండు వైమానిక దళ హెలికాప్టర్‌లతో పాటుగా పలువురు అధికారులు ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సంయుక్త బృందాలు సహాయక చర్యలు చేపట్టాయని డియోఘర్‌ డిప్యూటీ కమిషనర్ మంజునాథ్ భజంత్రీ మీడియాకు తెలిపారు. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన దృశ్యాలను భారత వైమానిక దళం ట్విటర్‌లో షేర్ చేసింది.

సుమోటోగా తీసుకున్న హైకోర్టు..

కాగా ఝార్ఖండ్‌లో ప్రముఖ పర్యాటక ప్రాంతంగా త్రికూట్ కొండలకు బాగా పేరుంది. ఈ నేపథ్యంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం టూరిస్టులు పోటెత్తారు. అయితే దురదృష్టవశాత్తూ సాంకేతిక కారణాలతో వర్టికల్ రోప్‌ వేలో రెండు కేబుల్ కార్లు ఢీకొన్నాయి. వెంటనే సమచారమందుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది.. రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టింది. ఎయిర్‌ఫోర్స్‌ కూడా రంగంలోకి దిగి ఆర్మీ హెలికాఫ్టర్ల ద్వారా వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టాయి. కాగా సహాయచర్యల సమయంలో ఒక వ్యక్తి హెలికాప్టర్‌ నుంచి జారి, కిందపడి చనిపోయారు. కాగా నేటి ఉదయం కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. హెలికాప్టర్ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు ఒక మహిళ కిందపడి మృత్యువాత పడింది. కాగా ఈ కేబుల్ కార్లను ఓ ప్రైవేట్ కంపెనీ నడుపుతుందని.. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే ఆపరేటర్లు అక్కడి నుంచి పారిపోయారని జిల్లా అధికారులు . ఈ ప్రమాదానికి గల పూర్తి కారణాలను ఇంకా నిర్ధారించాల్సి ఉందని వారు తెలిపారు. కాగా ఈ ప్రమాదాన్ని సీరియస్‌గా తీసుకున్న ఝార్ఖండ్‌ హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. ఏప్రిల్ 26న దీనిపై విచారణ చేపట్టనున్నట్లు పేర్కొంది. ఆలోపు ప్రమాదంపై సమగ్ర విచారణ నివేదికను అఫిడవిట్ ద్వారా దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Also Read: Bank Alert: HDFC యూజర్లకు షాక్.. UPI చెల్లింపులకు పరిమితి పెట్టిన బ్యాంక్.. పూర్తి వివరాలు..

Crypto Investment: మీరు క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే.. ఈ 7 విషయాలను తప్పక గుర్తుంచుకోండి..

Meat-eating: దేశంలో నాన్‌ వెజ్‌పై కొత్త వివాదం.. మాంసాహారం భారతీయుల ఆహారంలో భాగమేనా..?

సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!