Kishan Reddy: ఏపీ, కర్ణాటకకు లేని సమస్య మీకెందుకు..? తెలంగాణ సర్కార్‌కు కిషన్‌రెడ్డి సూటి ప్రశ్న

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వడ్ల పంచాయితీ మరింత ముదురుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.

Kishan Reddy: ఏపీ, కర్ణాటకకు లేని సమస్య మీకెందుకు..? తెలంగాణ సర్కార్‌కు కిషన్‌రెడ్డి సూటి ప్రశ్న
Kisan Reddy
Follow us

|

Updated on: Apr 12, 2022 | 4:52 PM

Kishan Reddy on Paddy Procurement: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వడ్ల పంచాయితీ మరింత ముదురుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. బాయిల్డ్‌ రైస్‌ ఇవ్వబోమని రాసిచ్చి.. ఇప్పుడెందుకు రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు. భూకంపం సృష్టిస్తామని చెబుతున్న కేసీఆర్‌.. ముందు మీ పార్టీలో భూకంపం రాకుండా చూసుకోవాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హితవు పలికారు. మరోవైపు కేంద్రానికి సీఎం కేసీఆర్ విధించిన డెడ్‌లైన్ ముగిసింది. ఈ నేపథ్యంలో సమావేశమైన రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం ప్రకటించే అవకాశముంది.

అయితే, తెలంగాణ ప్రభుత్వం ధాన్యంపై లేని సమస్యను ఉన్నట్లుగా చూపిస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ధ్వజమెత్తారు. బాయిల్డ్‌ రైస్‌ను దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనూ వినియోగించడం లేదన్నారు. బాయిల్డ్‌ రైస్‌ను ఉచితంగా పంచినా.. ప్రజలు తినే పరిస్థితి లేదని పేర్కొన్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ప్రజల కోణంలోనే బాయిల్డ్‌ రైస్‌ సేకరణను ఎఫ్‌సీఐ నిలిపి వేసిందని మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ లేని సమస్యను సృష్టించారని.. పైగా వాస్తవాలను వక్రీకరిస్తూ టీఆర్ఎస్ నేతలు ధర్నాల పేరుతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

గత సీజన్‌లో ఎఫ్‌సీఐకి 62 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం ఇస్తామని రాష్ట్రం ఒప్పందం చేసుకుందన్నారు. అలాగే గత సీజన్‌లో ఇస్తామన్న బాయిల్డ్‌ రైస్‌ను రాష్ట్రం ఇప్పటికీ పూర్తిగా ఇవ్వలేదు. ఇంకా 8.34 లక్షల టన్నుల బాయిల్డ్‌ రైస్‌ను ఎఫ్‌సీఐకి పంపలేదు. ఒప్పందం ప్రకారం పంపాల్సిన బియ్యాన్ని ఎఫ్‌సీఐకి ఎందుకు పంపలేదు? అనేక విషయాల్లో సీఎం కేసీఆర్‌ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ధాన్యాన్ని ఏడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకున్నారని ఎద్దేవా చేసిన కిషన్ రెడ్డి.. బాయిల్డ్‌ రైస్‌ కాకుండా ముడి బియ్యాన్ని సరఫరా చేస్తే కేంద్రం తీసుకుంటుందన్నారు. అయినప్పటికీ వడ్లు సేకరించి రా రైస్‌గా ఇస్తే కేంద్రానికి ఎలాంటి అభ్యంతరం లేదు. కేంద్రానికి రా రైస్‌ సరఫరా చేస్తే నూకల రూపంలో కొంత మేర నష్టం రావొచ్చు. రైతుల కోసం కొద్ది నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించలేదా?’’ అని కిషన్‌ రెడ్డి ప్రశ్నించారు.

సీఎం కేసీఆర్ వైఖరి, వితండవాదం, విషప్రచారం చాలా విచిత్రంగా ఉందని విరుచుకుపడ్డారు కిషన్ రెడ్డి. వ్యవసాయ మోటర్లకు కేంద్రం మీటర్లు పెడుతుంది అంటూ నానా హంగామా చేశారు. మీటర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయమని రైతులు కూడా అర్ధం చేసుకున్నారన్నారు. అలాగే, వడ్ల విషయంలో లేని సమస్యను ఉన్నట్టుగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. గత సీజన్లో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం చివరి గింజ వరకు కొంటామని చెప్పాం. ఆ అగ్రిమెంట్ లో మిగులు బాయిల్డ్ రైస్ ఉంటే, అది కూడా కొంటామని అన్నానని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. 8.34 లక్షల మెట్రిక్ టన్నులు ఇందులో 1.34 లక్షల బాయిల్డ్ రైస్ కలుపుకుని ఇవ్వాల్సిన బియ్యమే ఇప్పటివరకు FCIకి అందించలేదని కిషన్ రెడ్డి తెలిపారు. ఇచ్చిన టార్గెట్ పూర్తిచేయలేదు. ఇందుకోసం కేంద్రం 6 సార్లు టార్గెట్ పొడిగించింది. ఎందుకు ఇవ్వలేకపోయారు? ఇంత పంట పండలేదా? లేదా రైస్ మిల్లర్లు విదేశాలకు ఎగుమతి చేసుకున్నారా? అసలు ఏమైందో చెప్పాలంటూ కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

ఇప్పటికైనా రబీలో వచ్చిన దిగుబడిని నేరుగా మిల్లు పట్టించి ఇవ్వాలని కిషన్ రెడ్డి తెలిపారు. బాయిల్డ్ రైస్ చేయకండి. నూకలు వస్తే భరించండి. ఆ మాత్రం చేయలేరా? నియమాల ప్రకారం కేంద్రం కూడా కొంత శాతం నూకలు తీసుకుంటుందని కిషన్ రెడ్డి వెల్లడించారు. నియమ, నిబంధనల ప్రకారం 25% నూకలు FCI అనుమతిస్తుందన్నారు. ఇవన్నీ పోను మిగిలే నూకలు చాలా తక్కువ ఉంటాయి. ఆ మాత్రం రాష్ట్రం భరించలేదా? కర్ణాటక, ఏపీ సహా ఇతర రాష్ట్రాలు భరిస్తున్నాయి. కేంద్రం ఇస్తున్న అడ్మినిస్ట్రేటివ్ చార్జెస్ ద్వారా రాష్ట్ర సివిల్ సప్లైస్ పనిచేస్తుంది. ప్రతి క్వింటాలు మీద రూ. 3,187 కేంద్రం ఖర్చు చేస్తుంది. బస్తా సంచులకు, సుతిలి దారానికి, హమాలికి.. ఇలా అన్ని ఖర్చులు కేంద్రం భరిస్తుంది. రైతులకు ఎరువులు ఉచితంగా ఇస్తానని కేసీఆర్ అన్నారు. ప్రపంచంలోనే సంచలనం అన్నారు. చరిత్ర సృష్టిస్తాము అన్నారు. కానీ ఇంతవరకు అమలే కాలేదని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. 24 లేదా 26 లక్షల టన్నుల ఎరువులు తెలంగాణలో రైతులకు 100% ఉచితంగా సరఫరా చేస్తామని కేసీఆర్ అన్నారు. ఇచ్చిన మాటలు ఎమయ్యాయని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ