Jhansi: మరో రైల్వేస్టేషన్ పేరు మార్చేసిన ప్రభుత్వం.. ఇకనుంచి వీరాంగన లక్ష్మీబాయి రైల్వేస్టేషన్‌గా మార్పు

|

Dec 30, 2021 | 7:05 AM

Jhansi Railway Station : ఝాన్సీ రైల్వే స్టేషన్ పేరు మార్చాలన్న రైల్వే ప్రతిపాదనకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

Jhansi: మరో రైల్వేస్టేషన్ పేరు మార్చేసిన ప్రభుత్వం.. ఇకనుంచి వీరాంగన లక్ష్మీబాయి రైల్వేస్టేషన్‌గా మార్పు
Jhansi Railway Station
Follow us on

Veerangana Rani Laxmibai Station: ఝాన్సీ రైల్వే స్టేషన్ పేరు మార్చాలన్న రైల్వే ప్రతిపాదనకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇంతకుముందు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దీనిపై ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. రాబోయే రోజుల్లో ఝాన్సీ స్టేషన్‌ను వీరాంగన లక్ష్మీబాయి రైల్వేస్టేషన్‌గా పిలవనున్నారు. కొన్నేళ్ల క్రితం ఝాన్సీలో జరిగిన రైల్వే సమావేశంలో ఝాన్సీకి రాణి లక్ష్మీబాయి పేరు పెట్టాలని బీజేపీ రాజ్యసభ ఎంపీ ప్రభాత్ ఝా సహా పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు.

దీనిపై, రైల్వే శాఖ హోం మంత్రిత్వ శాఖ సమ్మతితో ప్రక్రియను ప్రారంభించింది. తాజాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుండి కూడా ఆమోదం పొందింది. ఇది బుందేల్‌ఖండ్ ప్రజలకు గర్వకారణమని ఝాన్సీ ఎంపీ అనురాగ్ శర్మ అన్నారు. రైల్వే మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు త్వరలో న్యూఢిల్లీలోని రైల్వే స్టేషన్ పేరు మార్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఝాన్సీ రైల్వే అధికారి తెలిపారు. దీని ప్రకారం స్టేషన్ కోడ్ మార్చడం జరుగుతుంది. ఇంతకుముందు మొఘల్‌సరాయ్ రైల్వే స్టేషన్ పేరు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ రైల్వే స్టేషన్‌గా మార్చడం జరిగింది. బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అనేక నగరాల పేర్లను కూడా మార్చింది.


ఇదిలావుంటే, ఝాన్సీలో మొదటి బ్యాటరీతో నడిచే బస్సులను మంగళవారం నుంచి ప్రారంభించారు. రానున్న రోజుల్లో మరో ఇరవై బస్సులు రానున్నాయి. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద ఈ బస్సుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. మేయర్ రామ్ తిరత్ సింఘాల్, ఎమ్మెల్యే రవిశర్మ సమక్షంలో ఝాన్సీ ఎంపీ అనురాగ్ శర్మ కోచాభవర్ ప్రాంతంలోని ఎలక్ట్రానిక్ రీచార్జింగ్ పాయింట్ నుంచి బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. బబినా, మౌరానీపూర్, రైల్వే స్టేషన్ మొదలైన వాటితో సహా జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో బస్సులు నడుస్తాయి.

మొట్టమొదటిసారిగా, నగరవాసులు తమ రోజువారీ ప్రయాణాన్ని సులభతరం చేసే సిటీ బస్సులో ప్రయాణించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఝాన్సీ ఎంపీ అనురాగ్ శర్మ మాట్లాడుతూ.. ‘‘నగరానికి మొదట్లో పదిహేను బస్సులకు అనుమతి లభించిందని, అందులో ఐదు బస్సులను మంగళవారం ప్రారంభించామని, మిగిలినవి త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు.

Read Also…  Encounter: జమ్మూ కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఇద్దరు పాకిస్థానీలతో సహా ఆరుగురు ఉగ్రవాదులు మృతి