JEE Main 2021 Admit Card: కరోనా వైరస్ తగ్గుముఖం పట్టింది. మరోవైపు వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వచ్చింది. దీంతో బోర్డ్ ఎగ్జామ్స్, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నిర్వహణ స్టార్టయ్యింది. ఈ క్రమంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్స్ పరీక్షల అడ్మిట్ కార్డులు విడుదల చేసింది. అధికారిక వెబ్‌సూట్‌లో 2021 అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉంటాయని.. వాటిని డౌన్‌లోడ్ చేసుకోవాలని అభ్యర్థులకు సూచించింది. అప్లికేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, సెక్యూరిటీ పిన్ లాంటి వివరాలు నమోదు చేసి హాల్ టికెట్ పొందవచ్చు.
మొత్తం 4 దశలలో జేఈఈ మెయిన్ 2021 జరగనున్నాయి. ఫస్ట్ ఫేజ్‌లో ఫిబ్రవరి 23 నుంచి 26 తేదీల మధ్య జేఈఈ మెయిన్ తొలి దశ పరీక్ష నిర్వహించనున్నారు. అఫిషియల్ వెబ్‌సైట్‌లో హాల్ టికెట్ల డౌన్‌లోడ్ కోసం మొత్తం 3 లింక్స్ అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. కాగా, హాల్ టికెట్లను పోస్ట్ ద్వారా ఎవరికీ పంపలేదని, ఆన్‌లైన్‌లో మాత్రమే డౌన్‌లోడ్‌లోచేసుకోవాలని అధికారులు సూచించారు. కాగా, ఈ ఏడాదినుంచి జేఈఈ మెయిన్ పరీక్షను ఒకటికంటే ఎక్కువసార్లు రాసుకునే ఛాన్స్ ఉంది. జేఈఈకి అర్హత సాధించాలంటే విద్యార్థులు ఇంటర్ పాసవ్వాల్సి ఉంటుంది. ఈ ఏడాది జేఈఈ మెయిన్ కోసం 6.60 లక్షల మంది స్టూడెంట్స్ తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్: jeemain.nta.nic.in. ను సందర్శించండి.
Also Read:
FASTag : ఫాస్టాగ్ విషయంలో ఓ గుడ్ న్యూస్.. పనిలో పనిగా దాన్ని ఎలా కొనుగోలు చేయాలో వివరాలు మీ కోసం
Student suicide: “అమ్మ లేకుండా నేనెలా బ్రతకగలను”..! క్లాస్ రూమ్‌లో విద్యార్థి ఆత్మహత్య..