కరోనా మహమ్మారికి అడ్డువేసే క్రమంలో మార్చి 22వ తేదీన ప్రజలందరూ జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దేశ ప్రజలందరూ తమ తమ ఇళ్లలోనే ఉండాలని.. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని ఆయన సూచించారు. ఇక ఈ పిలుపుకు దాదాపుగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతును తెలిపాయి. మరోవైపు సినీ సెలబ్రిటీలు సైతం మోదీకి మద్దతు ప్రకటించారు. ఈ క్రమంలో టాలీవుడ్ కూడా జనతా కర్ఫ్యూకు తమ మద్దతును ప్రకటించింది. టాలీవుడ్ ప్రముఖులైన మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు సహా పలువురు హీరోలు, హీరోయిన్లు జనతా కర్ఫ్యూలో భాగం అవ్వాలని తమ అభిమానులతో పాటు అందరినీ కోరారు. ఈ మహమ్మారికి అడ్డుకట్టవేసేందుకు దేశ ప్రజలందరూ ఈ చిన్న కృషిని చేయాలని వారు కోరారు. మరోవైపు కోలీవుడ్ లోనూ కమల్ హాసన్, రజనీకాంత్ తదితరులు జనతా కర్ఫ్యూకు మద్దతు ప్రకటించారు.
Read This Story Also: కరోనా ఎఫెక్ట్.. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ వాయిదా
Mega Star Chiranjeevi garu requests us to participate in #JanataCurfew and appreciate the efforts being put in by the officials. pic.twitter.com/xaV9sLJrKB
— Konidela Pro Company (@KonidelaPro) March 21, 2020
ప్రధాని మాట పాటిద్దాం-కరోనా విముక్త భారతాన్ని సాధిద్దాం pic.twitter.com/CoFuJVTayz
— Pawan Kalyan (@PawanKalyan) March 20, 2020
Urging all citizens to support the clarion call of our honourable PM @narendramodi and take part in the #JanataCurfew this Sunday to fight the #Coronavirus.
— Mahesh Babu (@urstrulyMahesh) March 20, 2020
This Sunday (March 22nd)
Starting from 7 am to 9 pm
Let's all stay at our homes and show solidarity in a time of crisis.
I'll be following it, hope you will too.. #JanataCurfew
— Venkatesh Daggubati (@VenkyMama) March 21, 2020