కరోనా ఎఫెక్ట్.. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ వాయిదా

ప్రపంచవ్యాప్తంగా ప్రతి రంగంపై కరోనా ప్రభావం పడింది. ఈ వైరస్ కారణంగా అగ్రదేశాల స్టాక్ మార్కెట్లు సైతం కుప్పకూలాయి. సినీ రంగంపై కూడా కరోనా తీవ్ర ప్రభావాన్ని చూపింది.

కరోనా ఎఫెక్ట్.. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ వాయిదా
Follow us

| Edited By:

Updated on: Mar 21, 2020 | 1:03 PM

ప్రపంచవ్యాప్తంగా ప్రతి రంగంపై కరోనా ప్రభావం పడింది. ఈ వైరస్ కారణంగా అగ్రదేశాల స్టాక్ మార్కెట్లు సైతం కుప్పకూలాయి. సినీ రంగంపై కూడా కరోనా తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఇప్పటికే పలు సినిమాల షూటింగ్‌లకు బ్రేక్ పడగా.. కొన్ని మూవీల విడుదల వాయిదా పడింది. ఇక దీని విస్తరణ రోజురోజుకు ఎక్కువవుతోన్న నేపథ్యంలో ప్రఖ్యాత కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కూడా వాయిదా పడింది. ఈ ఉత్సవాలను వాయిదా వేసినట్లు ద‌క్షిణ ఫ్రాన్స్‌లోని కేన్స్ నిర్వాహ‌కులు తెలిపారు. మే 12 నుండి 23వ‌ర‌కు జ‌ర‌గాల్సి ఉన్న ఈ కార్య‌క్ర‌మాన్ని.. జూన్ చివ‌రిలో గానీ జూలైలో నిర్వ‌హిస్తామ‌ని వారు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

కాగా కేన్స్‌లో పాల్గొనేందుకు వివిధ దేశాలకు చెందిన వేలాది మంది సినీ నిర్మాతలు, ప్రముఖులు మరియు కార్యనిర్వాహకులు ఫ్రెంచ్ నగరానికి రావాల్సి ఉంది. అయితే కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఈ కార్య‌క్ర‌మాన్ని కొద్ది రోజుల పాటు ర‌ద్దు చేస్తేనే మంచిద‌ని భావించిన మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా కేన్స్‌లో గెలుపొందిన సినిమాల‌ని బ‌ట్టే ఆస్కార్ రేసు కూడా ఉంటుంది. ఇదిలా ఉంటే గతంలోనూ పలుమార్లు కేన్స్‌ ఉత్సవాలు రద్దు చేయబడ్డాయి. బడ్జెట్ సమస్యల కారణంగా 1948, 1950లలో కేన్స్ ఉత్సవాలను రద్దు చేయగా.., 1968లో నిరసనల కారణంగా మధ్యలో ఈ కార్యక్రమం నిలిచిపోయిన విషయం తెలిసిందే.

Read This Story Also: గురువు ఎంట్రీ రోజునే శిష్యుడి ఎంట్రీ..!