Jammu Kashmir: అనంతనాగ్‌ అర్వానీ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ ..

|

Dec 24, 2021 | 7:33 AM

Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరుగుతోంది. అర్వానీ ప్రాంతంలో..

Jammu Kashmir: అనంతనాగ్‌ అర్వానీ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ ..
Jammu Kashmir
Follow us on

Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరుగుతోంది. అర్వానీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరుగుతున్నదని కశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు. పోలీసులు, భద్రతా బలగాలు అక్కడికక్కడే మోహరించారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ఆదివారం శ్రీనగర్‌లోని హర్వాన్ ప్రాంతంలో భద్రతా బలగాలు చేపట్టిన ఎన్‌కౌంటర్‌లో పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాది హతమయ్యాడు. ఇటీవల బందిపొరలో ఇద్దరు పోలీసులను హతమార్చడంతోపాటు పలు ఉగ్రవాద ఘటనల్లో ప్రమేయం ఉన్న వ్యక్తిగా గుర్తించారు. హర్వాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం మేరకు భద్రతా బలగాలు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించమని పోలీసులు తెలిపారు. భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో సెర్చ్ ఆపరేషన్ ఎన్‌కౌంటర్‌గా మారిందని చెప్పారు.

కాశ్మీర్ లోయలో కొద్ది నిమిషాల వ్యవధిలో జరిగిన రెండు వేర్వేరు ఉగ్రవాద ఘటనల్లో బుధవారం నాడు ఒక పౌరుడు, ఒక పోలీసు మరణించారు. ఒకవైపు, దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని బిజ్‌బెహరా ప్రాంతంలో జరిగిన దాడిలో శ్రీనగర్‌లోని నవాకడల్‌లో ఉగ్రవాదులు ఒక పౌరుడిని కాల్చి చంపగా, అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గాయపడ్డారు.

ఇదే విషయంపై పోలీసు అధికారి మాట్లాడుతూ..  “బుధవారం సాయంత్రం 5:55 గంటలకు శ్రీనగర్‌లోని నవకడల్ ప్రాంతంలోని ఉగ్రవాదులు రౌఫ్ అహ్మద్ పై కాల్పులు జరపగా.. అతను తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే సమీపంలోని ఎస్‌ఎంహెచ్‌ఎస్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సంఘటన జరిగిన కొద్దిసేపటికే జరిగిన ఈ ఘటనలో, బిజ్‌బెహరా ఆసుపత్రి వెలుపల ఉగ్రవాదులు పోలీసు ఏఎస్‌ఐ మహ్మద్ అష్రఫ్‌పై కాల్పులు జరిపారు. ఈ కాల్పులలో అష్రఫ్ గాయపడ్డారు.. వెంటనే  ఏఎస్ఐని అదే ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం శ్రీనగర్‌లోని ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అష్రఫ్ అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు.

Also Read: ఈ రోజు ఈ రాశివారు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..