మందు-మగువ- మనీ- దవీందర్‌సింగ్‌ లైఫ్‌స్టయిల్‌

|

Feb 07, 2020 | 6:25 PM

హిజ్బుల్‌ ముజహిదీన్‌ ఉగ్రవాదులతో అంటకాగిన జమ్ము కశ్మీర్‌ డీఎస్పీ దవీందర్‌సింగ్‌ మామూలోడు కాదు… ఇప్పటికే పోలీసు రిమాండ్‌లో ఉన్న దవీందర్ మన సీతయ్య టైపట! ఎవరి మాట వినడట! దవీందర్‌సింగ్‌ను అరెస్ట్‌ నేపథ్యంలో జరిపిన దాడుల్లో బోలెడన్ని బిత్తరపోయే ఆధారాలు వెలుగుచూశాయి.. ఇంకా చూస్తున్నాయి… ఆయనగారు వెలగబెట్టిన నిర్వాకాలు.. చేసిన లీలలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి.. ఏ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీకి పని చేసేవాడు కాదట! లెక్కలేనితనం టన్నుల కొద్దీ ఉందట! అసలు దవీందర్‌సింగ్‌ జీవనశైలే భిన్నమైనదట! రోజూ పెగ్గులు […]

మందు-మగువ- మనీ-  దవీందర్‌సింగ్‌ లైఫ్‌స్టయిల్‌
Follow us on

హిజ్బుల్‌ ముజహిదీన్‌ ఉగ్రవాదులతో అంటకాగిన జమ్ము కశ్మీర్‌ డీఎస్పీ దవీందర్‌సింగ్‌ మామూలోడు కాదు… ఇప్పటికే పోలీసు రిమాండ్‌లో ఉన్న దవీందర్ మన సీతయ్య టైపట! ఎవరి మాట వినడట! దవీందర్‌సింగ్‌ను అరెస్ట్‌ నేపథ్యంలో జరిపిన దాడుల్లో బోలెడన్ని బిత్తరపోయే ఆధారాలు వెలుగుచూశాయి.. ఇంకా చూస్తున్నాయి… ఆయనగారు వెలగబెట్టిన నిర్వాకాలు.. చేసిన లీలలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి.. ఏ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీకి పని చేసేవాడు కాదట! లెక్కలేనితనం టన్నుల కొద్దీ ఉందట! అసలు దవీందర్‌సింగ్‌ జీవనశైలే భిన్నమైనదట! రోజూ పెగ్గులు పడాల్సిందే..! అది కూడా ఖరీదైన లిక్కరే! ఓ డజన్‌ మంది అమ్మాయిలతో సంబంధాలున్నాయట… వాళ్లను మచ్చిక చేసుకునేందుకు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవాడట… లైంగిక సంబంధాలను నెరపడం కోసం నిత్యం వయాగ్రాను వాడేవాడట! మొత్తానికి ఆయనగారిదంతా ఖరీదైన వ్యవహారాలేనట! తనకున్న ఆ ఖరీదైన అలవాట్లను కొనసాగించడానికి డబ్బు అవసరం పడింది… అలాగే శ్రీనగర్‌లోని ఇంద్రానగర్‌లో నిర్మించుకుంటున్న బ్రహ్మండమైన విల్లాకు నిధుల కొరత ఏర్పడింది… బంగ్లాదేశ్‌లో మెడిసిన్‌ చదువుతున్న ఇద్దరు కూతుళ్లకు ఫీజులు కట్టాల్సి వచ్చింది… అలాగే శ్రీనగర్‌లోని ప్రముఖ స్కూల్‌లో కొడుకు చదువుతున్నాడు.. అతడికీ ఫీజు కట్టాలి… ఇవన్నీ ఒక్కసారి మీదపడటంతో పక్కచూపులు చూశాడు దవీందర్‌సింగ్‌… మిలిటెంట్లు.. ఆయుధాలతో దవీందర్‌ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడేంతవరకు విపరీతంగా ఖర్చు పెట్టేవాడని ఎన్‌ఐఎ వర్గాలు తెలిపాయి.. పాపం పట్టుబడిన తర్వాత దవీందర్‌సింగ్‌లో పశ్చాత్తాపం కనిపించిందట! 40 ఏళ్లుగా దేశం కోసం చేసిన సేవలన్నీ ఒక్క దెబ్బతో మట్టికొట్టుకుపోయాయనని ఆవేదన చెందాడట… దర్యాప్తులో చాలాసార్లు కన్నీరు కార్చాడట! హిజ్బుల్‌ కమాండర్‌ నవీద్‌ బాబు, అతడి ఇద్దరు అనుచరులకు దవీందర్‌ సింగ్‌ సాయం చేశాడన్నదే ఇప్పటి వరకు మనకు తెలిసింది.. ఇంతకు మించి ఆయనేమైనా దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారా అన్నదానిపై దర్యాప్తు సాగుతోంది..