Encounter: జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. అల్ బదర్ చీఫ్ హతం.. కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్

|

Mar 09, 2021 | 10:16 PM

Jammu and Kashmir: జమ్మూకాశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు కీలక ఉగ్రవాదిని హతమార్చాయి. కాశ్మీర్‌లోని సోపోర్‌ సమీపంలో మంగళవారం రాత్రి ఉగ్రవాదులు-భద్రతా దళాల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో...

Encounter: జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. అల్ బదర్ చీఫ్ హతం.. కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్
Follow us on

Jammu and Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు కీలక ఉగ్రవాదిని హతమార్చాయి. కాశ్మీర్‌లోని సోపోర్‌ సమీపంలో మంగళవారం రాత్రి ఉగ్రవాదులు-భద్రతా దళాల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాద సంస్థ అల్ బదర్ చీఫ్ గ్యానీ ఖ్వాజాను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. కాశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ ఈ ఎన్‌కౌంటర్‌ను ధ్రువీకరించారు. ఖ్వాజాను హతమార్చడంపై ఆయన ట్విట్ చేస్తూ.. భద్రతా దళాలు సాధించిన గొప్ప విజయంగా అభివర్ణించారు.

సోపోర్ జిల్లా తుజ్జార్ గ్రామంలోని ఓ ఇంట్లో ఇద్దరు ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారం మేరకు స్థానిక పోలీసులు, సీఆర్‌పీఎఫ్, ఆర్మీ బృందం సెర్చ్ ఆపరేషన్‌ను సాయంత్రం ప్రారంభించింది. బలగాలను చూసిన వెంటనే ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ పారిపోయేందుకు ప్రయత్నించారు.

అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అల్ బదర్ చీఫ్ గ్యాన్ ఖ్వాజాను హతమైనట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే… ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి భారీగా పేలుడు పదార్థాలు, ఇతర మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ప్రాంతంలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు.

 

Also Read: