Poonch Operation: పూంచ్‌లో కొనసాగుతున్న ఉగ్రవేట.. పరిస్థితిని స్వయంగా సమీక్షించిన ఆర్మీ చీఫ్‌ మనోజ్‌పాండే

అమరులైన ఐదుగురు జవాన్ల భౌతికకాయాలను స్వస్థలాలకు తరలించారు. కాన్పూర్‌కు చెందిన కరణ్‌సింగ్‌ యాదవ్‌కు కన్నీటి వీడ్కోలు పలికారు స్థానికులు. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. అటు ఉగ్రవాదుల దాడులకు నిరసనగా జమ్ములో నిరసనలు కొనసాగుతున్నాయి. డోగ్రా ఫ్రంట్‌ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Poonch Operation: పూంచ్‌లో కొనసాగుతున్న ఉగ్రవేట.. పరిస్థితిని స్వయంగా సమీక్షించిన ఆర్మీ చీఫ్‌ మనోజ్‌పాండే
Poonch Search Operation

Updated on: Dec 25, 2023 | 4:58 PM

జమ్ముకశ్మీర్‌ లోని పూంచ్‌ సెక్టార్‌లో ఐదుగురు జవాన్లను ఊచకోత కోసిన ముష్కరుల కోసం గాలింపు చర్యలను వేగవంతం చేశారు. ఆర్మీ చీఫ్‌ మనోజ్‌పాండే పూంచ్‌లో పరిస్థితిని స్వయంగా సమీక్షించారు. ఇప్పటికే రాజౌరికి అదనపు బలగాలను తరలించారు. సరిహద్దులపై హెలికాప్టర్లతో నిఘా పెట్టారు.

జమ్మూ డివిజన్‌లోని పూంచ్, రాజోరి జిల్లాల్లో భద్రతా బలగాల సెర్చ్ ఆపరేషన్ సోమవారం ఐదో రోజు కొనసాగుతోంది. ఉగ్రవాదుల కోసం పోలీసులు, ఆర్మీ, సీఆర్‌పీఎఫ్‌ బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. నాలుగో రోజు రెండు జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. అదే సమయంలో, పూంచ్‌లో ఉగ్రవాదుల దాడిలో వీర మరణం పొందిన భారత సైనికుల త్యాగం దృష్ట్యా ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే జమ్మూ చేరుకున్నారు. రాజౌరీ-పూంచ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రవాద ఘటనలు, ఉగ్రవాద నిరోధక గ్రిడ్‌ను పటిష్టం చేయడంపై ఆయన అధికారులతో మేధోమథనం చేపట్టారు.

మరోవైపు అమరులైన ఐదుగురు జవాన్ల భౌతికకాయాలను స్వస్థలాలకు తరలించారు. కాన్పూర్‌కు చెందిన కరణ్‌సింగ్‌ యాదవ్‌కు కన్నీటి వీడ్కోలు పలికారు స్థానికులు. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. అటు ఉగ్రవాదుల దాడులకు నిరసనగా జమ్ములో నిరసనలు కొనసాగుతున్నాయి. డోగ్రా ఫ్రంట్‌ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఉత్తర కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, జమ్మూకు చెందిన వైట్ నైట్ కార్ప్స్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ లెఫ్టినెంట్ జనరల్ సందీప్ జైన్ మరియు సీనియర్ సివిల్ అడ్మినిస్ట్రేషన్, పోలీసు అధికారులు నిఘా కోసం రాజౌరీ-పూంచ్‌లో క్యాంప్ చేస్తున్నారు. పూంచ్ జిల్లాలోని సావ్ని ప్రాంతంలో ఉగ్రవాదుల దాడి జరిగిన ప్రదేశానికి సమీపంలో అనుమానాస్పద స్థితిలో ముగ్గురు గ్రామస్తుల మృతదేహాలను వెలికితీయడంపై ఆర్మీ అంతర్గత దర్యాప్తు ప్రారంభించింది. మరోవైపు కూంబింగ్‌ సందర్భంగా ముగ్గురు స్థానికులు చనిపోవడంపై విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…