JK Elections 2024: జమ్ముకశ్మీర్‌లో కొనసాగుతున్న రెండో విడత పోలింగ్.. సరళిని పరిశీలించిన విదేశీ ప్రతినిధులు..

|

Sep 25, 2024 | 10:46 AM

జమ్ముకశ్మీర్‌లో రెండో విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. 6 జిల్లాల్లో 26 అసెంబ్లీ స్థానాల బరిలో 239 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని పరీక్షించుకుంటున్నారు.

JK Elections 2024: జమ్ముకశ్మీర్‌లో కొనసాగుతున్న రెండో విడత పోలింగ్.. సరళిని పరిశీలించిన విదేశీ ప్రతినిధులు..
Jammu Polls
Follow us on

జమ్ముకశ్మీర్‌లో రెండో విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. 6 జిల్లాల్లో 26 అసెంబ్లీ స్థానాల బరిలో 239 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని పరీక్షించుకుంటున్నారు. 3 వేల 502 పోలింగ్‌ కేంద్రాల్లో భారీ బందోబస్తు మధ్య పోలింగ్ కొనసాగుతుంది. అక్టోబర్‌ 1న చివరివిడత పోలింగ్‌ జరగనుంది. అక్టోబర్‌ 8న ఫలితాలు వెలువడనున్నాయి.

కాగా.. జమ్మూకాశ్మీర్‌లో పోలింగ్ కొనసాగుతుండగా.. శ్రీనగర్‌లోని పలు పోలింగ్ స్టేషన్లకు వెళ్లిన విదేశీ ప్రతినిధులు పోలింగ్ సరళిని పరిశీలించారు. 5 జిల్లాల్లో 26 అసెంబ్లీ స్థానాలకు ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ భద్రత నడుమ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని పేర్కొన్నారు.

జమ్మూ కాశ్మీర్‌లోని రెండో విడతలో 26 సీట్లలో త్రిముఖ పొటీ నెలకొంది.. బీజేపీ, కాంగ్రెస్, పీడీపీతో పాటు నేషనల్ కాన్ఫరెన్స్ తీవ్ర పోటీపడుతున్నాయి.. ఈ దశలో, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర రైనా తోపాటు అల్తాఫ్ బుఖారీ వంటి నాయకులు భవితవ్యాన్ని పరీక్షించుకుంటున్నారు.

జమ్మూ కాశ్మీర్‌లో బిజెపి, బీజేపీ, నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి మధ్య త్రిముఖ పోటీ నెలకొంది..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..