ఆ గ్రామంలో పెను విషాదం చోటుచేసుకుంది. భార్య, భర్త, ఐదురుగురు పిల్లలతో సహా కాలువలో దూకి సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాజస్థాన్‌లో గురువారం నాడు చోటు చేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
రాజస్థాన్‌లోని జలోర్ జిల్లా సంచోర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివశిస్తున్న శంకర్ లాల్, బద్లి దంపతులు, వీరికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఐతే ఈ మధ్యకాలంఓ తరుచూ వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం నాడు కూడా దంపతులు గొడవపడ్డారు. ఏం జరిగిందో తెలియదుగానీ బుధవారం మధ్యాహ్నం 2 గంటల 30 నిముషాల ప్రాంతంలో శంకర్, తన భార్య పిల్లలను తీసుకుని సమీపంలోని నర్మద కాలువలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన పోలీసులు మృతదేహాలను బయటకు తీశారు. మెుదట 9 ఏళ్ల బాలుడి మృతదేహాన్ని వెలికితీశారు. సాయంత్రానికి మెుత్తం ఏడు మృతదేహాలను కాలువ నుంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గ్రామస్తులు, పోలీసులు, అధికారులు పెద్ద ఎత్తులన ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను స్థానిక ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.