Best Chief Minister: దేశంలో బెస్ట్ సీఎంగా యోగి.. తెలుగు సీఎంలు ఏ స్థానాల్లో ఉన్నారంటే.!

Best Chief Minister: దేశంలో బెస్ట్ సీఎం ఎవరు అనే విషయంపై 'మూడ్ ఆఫ్ ది నేషన్' ఓ సర్వే నిర్వహించింది. ప్రజా మూడ్ తెలుసుకొనేందుకు నిరంతరం ఈ సర్వే నిర్వహిస్తూ..

Best Chief Minister: దేశంలో బెస్ట్ సీఎంగా యోగి.. తెలుగు సీఎంలు ఏ స్థానాల్లో ఉన్నారంటే.!
Best Cm

Edited By: Anil kumar poka

Updated on: Aug 18, 2021 | 12:55 PM

Best Chief Minister: దేశంలో బెస్ట్ సీఎం ఎవరు అనే విషయంపై ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ ఓ సర్వే నిర్వహించింది. ప్రజా మూడ్ తెలుసుకొనేందుకు నిరంతరం ఈ సర్వే నిర్వహిస్తూ ఉంటుంది. అయితే, ఈ సారి చేసిన సర్వేలో ఆసక్తి కర ఫలితాలు వెల్లడయ్యాయి

ఈ సర్వేలో దేశంలోనే మంచి పరిపాలన ఇస్తున్న సీఎం గా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిలిచారు. బెస్ట్ సీఎం గా యోగీ 19 శాతం ఓట్లతో అగ్రస్థానం సొంతం చేసుకున్నారు.  ఇక దేశ రాజధాని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ 14 శాతం ఓట్లతో రెండోస్థానంలో.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఫైర్ బ్రాండ్ దీదీ మమతా బెనర్జీ మూడో ప్లేస్ లో నిలిచారు. నాలుగో స్థానంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ , అయిదో స్థానంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ నిలిచారు. అయితే గత ఏడాది మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో బెస్ట్ సీఎం గా ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిలిచిన సంగతి తెలిసిందే.

ఇక, ‘మోస్ట్ పాప్యులర్ సీఎమ్స్ ఇన్ దెయిర్ హోమ్ స్టేట్స్’ లో తమిళనాడు సీఎం స్టాలిన్‌ను స్వరాష్ట్ర ప్రజలు బెస్ట్ సీఎం అంటున్నారు. ఆ రాష్ట్రంలో 42 శాతం మంది ఆయనకు ఓట్లేసి అగ్రస్థానాన్ని కట్టబెట్టారు. అలాగే ప్రజాదరణలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ 38శాతంతో సెకండ్ ప్లేస్ లో .. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ 35శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. అయితే  రెండు మూడు స్థానాల్లో నిలిచారు. ‘మోస్ట్ పాప్యులర్ సీఎమ్స్ ఇన్ దెయిర్ హోమ్ స్టేట్స్’ లో టాప్ 10 లో ఏపీ సీఎం జగన్ పేరుతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు కూడా టాప్ టెన్ జాబితాలో లేదు

ఈ సర్వేలో భాగంగా 19 రాష్ట్రాల్లో 115 లోక్ సభ నియోజకవర్గాల్లో 230 అసెంబ్లీ స్థానాల్లో గత నెల 10-12 తేదీల మధ్య ఈ సర్వ్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో సర్వే కొనసాగింది.

Also Read: త్రివర్ణపతాకం పోస్టర్‌లో సోనూ సూద్ ఫోటో.. రియ‌ల్ హీరో ఆఫ్ ఇండియా అంటున్న అభిమాని

సావిత్రితో ఉన్న ఈ బాలనటుడు.. ఇప్పుడు స్టార్ హీరో.. ఎవరో కనిపెట్టండి చూద్దాం..

భర్త మరో మహిళతో ఉండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య..! తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి..

భార్య పేరు మీద ఇల్లు కొనుగోలు చేస్తున్నారా?.. ఆసక్తికర విషయాలు మీకోసమే..