Sabarimala Temple: శబరిమలలో తగ్గని భక్తుల రద్దీ.. రోజుకు లక్షకు పైగానే.. స్వామి దర్శనానికి ఎన్ని గంటలు పడుతుందంటే?

|

Dec 14, 2023 | 7:09 AM

భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ట్రావెన్కోర్ దేవస్థానం స్వామి దర్శన సమయాన్ని గంటపాటు పెంచినప్పటికీ ఫలితం కన్పించలేదు. భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో... క్యూ లైన్ల నిర్వహణలో కేరళ సర్కార్ విఫలమైందని ప్రతిపక్షాలు విమర్శించాయి..

Sabarimala Temple: శబరిమలలో తగ్గని భక్తుల రద్దీ.. రోజుకు లక్షకు పైగానే.. స్వామి దర్శనానికి ఎన్ని గంటలు పడుతుందంటే?
Sabarimala Temple
Follow us on

స్వామియే శరణం అయ్యప్ప… ఓవైపు శరణు ఘోష మరోవైపు భక్తుల అరగోస. శబరిమలలో కిలోమీటర్ల మేర క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. శబరిలో రద్దీని కంట్రోల్‌ చేయడం అధికారుల తరంకాలేదు.మరోవైపు ట్రైన్లలో బస్సుల్లో సొంత వాహనాల్లో వేలాది తరలివస్తున్నారు భక్తులు. రోజుకు 80 నుంచి లక్ష వరకూ వస్తుండటంతో… దర్శనానికి సమయం 18 నుంచి 24 గంటల పడుతోంది. కిలోమీటర్ల మేర భక్తులు బారులు దీరారు. క్యూలైన్‌లో నిరీక్షించలేక పలువురు యాత్రికులు దర్శనం చేసుకోకుండానే వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ట్రావెన్కోర్ దేవస్థానం స్వామి దర్శన సమయాన్ని గంటపాటు పెంచినప్పటికీ ఫలితం కన్పించలేదు. భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో… క్యూ లైన్ల నిర్వహణలో కేరళ సర్కార్ విఫలమైందని ప్రతిపక్షాలు విమర్శించాయి.. తిరువనంతపురంలో బీజేపీ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను.. పినరయి సర్కర్‌ తోసిపుచ్చింది. మరోవైపు ట్రావెన్‌కోర్‌ అధికారుల వైఫల్యంపై సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. ట్రావెన్‌కోర్‌ అధికారులు-పోలీసుల మధ్య సమన్వయ లోపం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు.

శబరిమలలో రద్దీని క్రమబద్దీకరించడం సహా భక్తుల కోసం యుద్దప్రాతిపదికన ఏర్పాటు చేశామన్నారు. అనవసర రాద్దాంతం, రాజకీయాలను పక్కనపెట్టి ప్రతిపక్షాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు కేరళ సర్కార్‌. శబరిమలైకి భక్తులు లక్షల్లో పోటెత్తడం పరిపాటే. మరి ఈసారి ఎందుకంత గడబిడ. కిలోమీటర్ల భక్తులు బారులు తీరాల్సిన దుస్థికి కారణం అధికారుల సమన్వలోపమేనని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం శబరిమలలో పరిస్థితి ఇది..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..