ISRO SSLV-D1: ఎస్‌ఎస్‌ఎల్‌వీ ప్రయోగంలో సాంకేతిక సమస్య.. టెర్మినల్ దశలో డేటా లాస్- ఇస్రో చీఫ్

|

Aug 07, 2022 | 4:27 PM

SSLV ప్రయోగం తర్వాత ఇస్రో చీఫ్ సోమనాథ్ మాట్లాడుతూ, అన్ని దశలు ఆశించినట్లుగానే స్పందించాయని, అయితే టెర్మినల్ దశలో కొంత డేటా నష్టం జరిగిందని తెలిపారు.

ISRO SSLV-D1: ఎస్‌ఎస్‌ఎల్‌వీ ప్రయోగంలో సాంకేతిక సమస్య.. టెర్మినల్ దశలో డేటా లాస్- ఇస్రో చీఫ్
Isro Sslv Launch
Follow us on

S Somnath on SSLV-D1: అంతరిక్ష సంస్థ మొట్టమొదటి చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహనం (SSLV) టెర్మినల్ దశలో డేటా నష్టాన్ని (సమాచారం కోల్పోవడం) ఎదుర్కొంది. దాంతో సంబంధాలు కోల్పోయింది. ఈ విషయాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు. అయితే, మిగిలిన మూడు దశలు ఆశించిన విధంగానే జరిగాయని అయన పేర్కొన్నారు. ప్రయోగ వాహనం, ఉపగ్రహాల స్థానాన్ని నిర్ధారించడానికి అంతరిక్ష సంస్థ డేటాను విశ్లేషిస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. SSLV-D1/EOS-02 భూమి పరిశీలన ఉపగ్రహాంతోపాటు విద్యార్థులు అభివృద్ధి చేసిన ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి మోసుకెళ్లింది.

అయితే, ఈ రాకెట్ ప్రయోగించిన కొద్ది నిమిషాల తర్వాత శ్రీహరికోటలోని మిషన్ కంట్రోల్ సెంటర్‌ నుంచి సోమనాథ్ మాట్లాడుతూ, “అన్ని దశలు ఆశించిన విధంగానే జరిగాయి. మొదటి, రెండవ, మూడవ దశలు తమ పనిని తమ పనిని సక్రమంగా పూర్తి చేశాయి. అయితే టెర్మినల్ దశలో కొంత డేటా నష్టం జరిగింది. మేం డేటాను విశ్లేషిస్తున్నాం. లాంచ్ వెహికల్ పనితీరుతో పాటు ఉపగ్రహాల స్థితి గురించి త్వరలో సమాచారం ఇస్తాం. అప్పటివరకు దయచేసి వేచి ఉండండి. పూర్తి వివరాలను త్వరలో తెలియజేస్తాం అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు.

ఇవి కూడా చదవండి

ఇస్రో తన తొలి SSLV మిషన్‌ను ఆదివారం ప్రయోగించింది. ఈ SSLV భూమి పరిశీలన ఉపగ్రహం EOS-02తోపాటు విద్యార్ధులు రూపొందించిన ఆజాద్‌శాట్ అనే ఉపగ్రహాన్ని మోసుకెళ్తుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న SSLV మార్కెట్‌లో పెద్ద భాగం కావాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. దాదాపు ఏడున్నర గంటల కౌంట్‌డౌన్ తర్వాత, 34 మీటర్ల పొడవైన SSLV ఉపగ్రహాలను వాటి నిర్దేశిత కక్ష్యలోకి చేర్చడానికి ఉదయం 9.18 గంటలకు బయలుదేరింది.

ఇన్‌ఫ్రా-రెడ్ బ్యాండ్‌లో అధునాతన ఆప్టికల్ రిమోట్ సెన్సింగ్‌ను అందించడానికి ఇస్రో భూమి పరిశీలన ఉపగ్రహాన్ని రూపొందించింది. EOS-02 అనేది అంతరిక్ష నౌకకు చెందిన చిన్న ఉపగ్రహ శ్రేణికి చెందిన ఉపగ్రహం. అదే సమయంలో, ‘Azadisat’ 75 వేర్వేరు పరికరాలను కలిగి ఉంది. వీటిలో ప్రతి ఒక్కటి 50 గ్రాముల బరువు ఉంటుంది. ఈ పరికరాలను తయారు చేసేందుకు ‘స్పేస్ కిడ్స్ ఇండియా’ విద్యార్థి బృందం కింద పనిచేస్తున్న ఇస్రో శాస్త్రవేత్తలు దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థినులకు మార్గనిర్దేశం చేశారు. ఈ ఉపగ్రహం నుంచి డేటాను స్వీకరించడానికి ‘స్పేస్ కిడ్స్ ఇండియా’ అభివృద్ధి చేసిన గ్రౌండ్ సిస్టమ్ ఉపయోగించారు.