PSLV-C52: నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ-సీ52 రాకెట్.. ఇస్రో ఈ ఏడాది తొలి ప్రయోగం సక్సెస్..

|

Feb 14, 2022 | 6:49 AM

ISRO PSLV-C52 : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఏడాది తొలి ప్రయోగాన్ని చేపట్టింది. నెల్లూరులోని షార్ నుంచి నుంచి పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సి52 (పీఎస్‌ఎల్‌వీ) సోమవారం ఉదయం 5.59కి నింగిలోకి

PSLV-C52: నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ-సీ52 రాకెట్.. ఇస్రో ఈ ఏడాది తొలి ప్రయోగం సక్సెస్..
Isro
Follow us on

ISRO PSLV-C52 : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఏడాది తొలి ప్రయోగాన్ని చేపట్టింది. నెల్లూరులోని షార్ నుంచి నుంచి పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సి52 (పీఎస్‌ఎల్‌వీ) సోమవారం ఉదయం 5.59కి నింగిలోకి దూసుకెళ్లింది. 25.30 గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం పీఎస్‌ఎల్‌వీ రాకెట్ ఆర్‌ఐశాట్‌-1, ఐఎన్‌ఎస్‌-2టీడీ, ఇన్‌స్పైర్‌శాట్‌-1 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లింది. అనంతరం 18.31 నిమిషాల తర్వాత ఈ మూడు ఉపగ్రహాలను రాకెట్‌ క్షక్ష్యలోకి ప్రవేశపెట్టింది. మూడు ఉపగ్రహాలు కూడా వేరు అయి నిర్ణీత కక్ష్యలోకి చేరాయి. ఈ ప్రయోగం మొత్తం నాలుగు దశల్లో పూర్తయింది. ఇస్రో చీఫ్‌గా ఇటీవల నియామకమైన సోమనాథ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన తొలి ప్రయోగం ఇది.

భూ పరిశీలన ఉపగ్రహాన్ని 529km ఎత్తులో ఉన్న సూర్యను వర్తన ధ్రువ కక్షలోకి ఈ సాటిలైట్ ను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. నిర్ణిత సమయంలో కక్ష్యలోకి EOS ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టారు. మూడు ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టారు. ఈ ఏడాది తొలి ప్రయోగం విజయవంతం అయిన నేపథ్యంలో శాస్త్రవేత్తలకు ఇస్రో చైర్మన్ సోమనాథన్ అభిననందనలు తెలిపారు.

ఉపగ్రహాలు ఇవే..

ఆర్‌ఐశాట్‌-1 : ఈ ఉపగ్రహం కాలపరిమితి పదేళ్లు. రేయింబవళ్లు అన్ని వాతావరణ పరిస్థితుల్లో పనిచేసేలా ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు. ఉపగ్రహంలో అధిక డేటా నిర్వహణ వ్యవస్థలు, అధిక నిల్వ పరికరాలు ఉన్నాయి. వ్యవసాయం, అటవీ, నీటి వనరుల నిర్వహణ కోసం విలువైన సమాచారం కనుగొనేందుకు ఈ ఉపగ్రహం ఉపయోగపడనుంది. దీని బరువు 1710 కిలోలు.

ఐఎన్‌ఎస్‌-2టీడీ : భారత్‌, భూటాన్‌ కలిసి రూపొందించిన ఈ ఉపగ్రహ కాలపరిమితి ఆరు నెలలు. సైన్స్, ప్రయోగాత్మక పేలోడ్స్‌ కోసం రూపొందించారు. ఈ ఉపగ్రహం బరువు 17.5 కిలోలు.

ఇన్‌స్పైర్‌శాట్‌-1 : పలు యూనివర్సిటీల విద్యార్థులు తయారుచేసిన ఈ ఉపగ్రహం కాలపరిమితి ఏడాది. తక్కువ భూకక్ష్యలో ఉండే ఈ ఉపగ్రహంలో భూమి అయానోస్పియర్‌ అధ్యయనం నిమిత్తం కాంపాక్ట్‌ అయానోస్పియర్‌ ప్రోబ్‌ అమర్చి ఉంటుంది. ఈ ఉపగ్రహం బరువు 8.1 కిలోలు.

Also Read:

IPL 2022 Auction Day 2 Highlights : అదరగొట్టారు జాక్‌ పాట్ కొట్టారు..ఐపీఎల్ రెండో రోజు యువ ప్లేయర్‌పై కాసుల వర్షం..

Ramnath Kovind: భక్తి మార్గమే వేల ఏళ్ల నుంచి భారత్‌ను ఏకం చేసింది.. శ్రీ రామనగరంలో ఆధ్యాత్మికత ఉట్టిపడుతోంది..