భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. డిసెంబర్ 17న పీఎస్ఎల్వీ సీ50 ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. ఇప్పటికే పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా 41 కమ్యూనికేషన్ ఉపగ్రహాలను కక్షలోకి పంపింది ఇస్రో. తాజాగా సీ50 ద్వారా మరో 42 కమ్యూనికేషన్ ఉపగ్రహాలను పంపేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇస్రో పుట్టుక, అభివృద్ధి చేపట్టిన ప్రయోగాలు, విజయాలు, అపజయాలు, సంచలనాల గురించి తెలుసుకుందాం….
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్‌ను అంతరిక్ష పరిశోధనల కోసం భారత ప్రభుత్వం నెలకొల్పింది. ఈ సంస్థ దేశాభివృద్ధి లక్ష్యంగా అంతరిక్ష విజ్ఞానాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో ఏర్పాటై, ప్రస్తుతం ప్రపంచంలోని అంతరిక్ష రంగ సంస్థల్లో ఒకటిగా పేరొందింది. బెంగుళూరు కేంద్రంగా ఏర్పాటైన ఇస్రో, దేశంలోని వివిధ ప్రదేశాల్లో పరిశోధన, అభివృద్ధి సౌకర్యాలు కలిగి ఉంది. ఇస్రో లోగోలో పైకి గురి పెట్టిన బాణం గుర్తు రాకెట్టును, అటూ ఇటూ ఉన్న సౌర ఫలకాలు ఉపగ్రహాన్నీ సూచిస్తాయి.
ఇస్రో తన మొదటి అంతరిక్ష నౌకని ఏప్రిల్ 19, 1975న ప్రయోగించింది. దాని పేరు ఆర్యభట్టను. ఈ ఉపగ్రహాన్ని భారత ప్రభుత్వం సోవియట్ యూనియన్ నుంచి ప్రయోగించింది. కాగా, 1979 నాటికి శ్రీహరికోట నుంచి అంతరిక్ష ప్రయోగాలు చేయడం భారత్ మొదలుపెట్టింది. కాగా, భారత్ మొదటగా ఎస్సెల్వీ ప్రయోగం చేసింది. అయితే అది రెండవ దశలో ఎదురయిన సమస్యతో విజయవంతం కాలేదు. ఎస్సెల్వీ రాకెట్‌లోని లోపాలను సరిదిద్ది 1980లో విజయవంతంగా ప్రయోగించింది ఇస్రో. ఎస్సెల్వీతో రోహిణి-1 ఉపగ్రహాన్ని అంతరిక్షంలో భారత్ ప్రయోగించింది. అయితే భారత్ నుంచి ప్రయోగించిన తొట్టతొలి ఉపగ్రహం అదే. 1987లో, 1988లో చేసిన ASLV ప్రయోగాలు రెండూ విఫలం అయ్యాయి. ఆ తర్వాత 1992లో ASLV ప్రయోగం విజయవంతం అయ్యింది. తక్కువ బరువు ఉన్న ఉపగ్రహాలను మాత్రమే ఇస్రో ప్రయోగించింది. 1993లో PSLV ప్రయోగం విఫలం మళ్లీ విఫలమైంది. 1994లో చేసిన PSLV ప్రయోగం విజయవంతంగా ప్రయోగించబడింది.
దశాబ్దాల వారీగా.. జయప్రదం పాక్షిక విజయం వైఫల్యాలు మొత్తం
1990-2000 3 1 1 5
2000 -10 11 0 0 11
2010 – 20 24 0 1 25
దశాబ్ది జయప్రదం పాక్షిక విజయం వైఫల్యాలు మొత్తం
2000లు 3 1 1 5
2010లు 4 0 2 6
జియోసింక్రొనస్ ఉపగ్రహ వాహక నౌక మార్క్ 3 (జీఎస్ఎల్వీ 3)
దశాబ్ది వారీగా జీఎస్ఎల్వీ మార్క్ 3 ప్రయోగ వివరాలు
దశాబ్ది జయప్రదం పాక్షిక విజయం వైఫల్యాలు మొత్తం
2010 2 0 0 2
ఇస్రో ప్రయోగించిన కొన్ని ఉపగ్రహాలు వాటి వివరాలు….
క్రమ సంఖ్య శాటిలైట్ ప్రయోగించిన తేదీ
1 INSAT-1A 10 ఏప్రిల్, 1982
2 INSAT-1B 30 ఆగష్టు, 1983
3 INSAT-1C 22 జూలై, 1988
4 INSAT-1D 12 జూన్, 1990
5 INSAT-2A 10 జూలై, 1992
6 INSAT-2B 23 జూలై, 1993
7 INSAT-2C 7 డిసెంబర్, 1997
8 INSAT-2D 4 జూన్, 1997
9 INSAT-2DT అంతరిక్షంలో కొనుగోలు చేయబడినది
10 INSAT-2E 3 ఏప్రిల్, 1999
11 INSAT-3A 10 ఏప్రిల్, 2003
12 INSAT-3B 22 మే, 2000
13 INSAT-3C 24 జనవరి, 2002
14 KALPANA-1 12 సెప్టెంబర్, 2002
15 GSAT-2 8 మే, 2003
16 INSAT-3E 28 సెప్టెంబర్, 2003
17 EDUSAT 20 సెప్టెంబర్, 2004
18 INSAT-4A 22 డిసెంబర్, 2005
19 INSAT-4C 10 జూలై, 2006
20 INSAT-4B 12 మార్చి, 2007
21 INSAT-4CR 2 సెప్టెంబరు, 2007
22 GSAT-7 30 ఆగష్టు, 2013
2005లో రెండో లాంచ్ ప్యాడు ఆపరేషన్ ప్రారంభం
2008లో చంద్రయాన్ ప్రయోగం
2014లో మంగళ్యాన్ ప్రయోగం… అంగారక గ్రహాన్ని మొదటి ప్రయత్నంలోనే విజయవంతంగా చేరుకున్న ఏకైక అంతరిక్ష సంస్థగా ఇస్రో ఆవిర్భవించింది.
2016లో పునర్వినియోగ లాంచి వాహనపు తొలి పరీక్ష విజయవంతమైంది
2016లో ఒకే రాకెట్టుతో 20 ఉపగ్రహాల ప్రయోగం, అప్పటి అన్ని ఉపగ్రహాలను పంపడం ఇస్రోకు మొదటి సారి… అప్పటి వరకు అదే అత్యధిక ఉపగ్రహాల రికార్డు
2017లో ఒకే రాకెట్టుతో 104 ఉపగ్రహాల ప్రయోగం, ఇది ప్రపంచ రికార్డుగా నమోదైంది.
2017లో జీఎస్ఎల్వీ మార్క్ 3 ప్రయోగం విజయవంతమైంది. దీనిలో విశిష్టత ఏంటంటే దేశీయంగా అభివృద్ధి చేసిన అత్యంత శక్తివంతమైన క్రయోజెనిక్ ఇంజను కావడం
2007లో నుంచే గగన్యాన్ ప్రాజెక్టు. దీని ద్వారా మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలకు ఇస్రో శ్రీకారం చుట్టింది. కానీ, నిధుల కొరతతో ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. అయితే ఇస్రో దగ్గరున్న శక్తిమంతమైన జీఎస్ఎల్వీ రాకెట్‌లకు మానవులను పంపే మాడ్యూల్‌ను తీసుకెళ్లే సామర్థ్యం లేకపోవడం, టన్నుల కొద్దీ బరువైన క్రూడ్ మాడ్యూల్‌ను తీసుకెళ్లే రాకెట్లు, క్రయోజనిక్ ఇంజిన్లు లేవు అయితే ఇస్రో మాత్రం ఆ దిశగా ప్రయోగాలు కొనసాగించింది. 2014లో తయారు చేసిన జీఎస్ఎల్వీ మార్క్ టూతో క్రయోజనిక్ ఇంజన్ సమస్య తీరింది. జీఎస్ఎల్వీ మార్క్ త్రీ కూడా ప్రస్తుతం సిద్ధంగా ఉంది. దీంతో ఇస్రో మరోసారి గగన్‌యాన్ ప్రయోగం తెరపైకి తీసుకొచ్చింది. చంద్రయాన్-2 మాడ్యూల్‌ను జీఎస్ఎల్వీ మార్క్ త్రీ తో కలిపి ప్రయోగించింది.
ఇండియన్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ పేరుతో భారత్ మానవ సహిత అంతరిక్ష యాత్ర ప్రయోగాన్ని 2017లో మళ్లీ ప్రారంభించింది. దీనిపై 2018 ఆగస్టు 15న ఎర్ర కోట నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ… భారత్ మానవసహిత అంతరిక్ష యాత్ర చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. గగన్‌యాన్ కార్యక్రమానికి 10 వేల కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. కాగా, ఇస్రో హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్‌ను బెంగళూరులోని ఇస్రో హెడ్ క్వార్టర్స్‌లో ఏర్పాటు చేశారు. ఈ ప్రయోగం ద్వారా ఇద్దరు లేదా ముగ్గురు భారతీయ వ్యోమగాముల్ని ఏడు రోజులు పాటు అంతరిక్షంలోకి పంపడం, తిరిగి వారిని క్షేమంగా వెనక్కి రప్పించేలా గగన్‌యాన్ తొలి ప్రయోగాం రూపకల్పన చేస్తున్నారు. దీనిని 2021 డిసెంబర్ లో ప్రయోగించే ఆలోచనలో ఇస్రో ఉంది. 2019లో ఆస్ట్రోనాట్ల ఎంపికతో పాటు, ఈ బృందం అంతరిక్షానికి వెళ్లే కార్యక్రమం, తిరిగి భూమ్మీదకు వచ్చే క్రూ మాడ్యూల్ ప్రయోగం విజయవంతమైంది.