JK Encounter: అనంతనాగ్‌లో ఎన్‌కౌంటర్.. ఐసిస్ ఉగ్రవాది హతం..

|

Dec 26, 2021 | 7:35 AM

ISIS Terrorist Killed In Encounter: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ కొనసాగుతోంది. నిన్న కాశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్‌, పుల్వామా

JK Encounter: అనంతనాగ్‌లో ఎన్‌కౌంటర్.. ఐసిస్ ఉగ్రవాది హతం..
Encounter
Follow us on

ISIS Terrorist Killed In Encounter: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ కొనసాగుతోంది. నిన్న కాశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్‌, పుల్వామా జిల్లాల్లో వేర్వేరుగా జరిగిన ఎన్‌కౌంటర్‌లలో నలుగురు ఉగ్రవాదులను హతమార్చినట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి. షోపియాన్‌లోని చౌగామ్‌ ప్రాంతంలో హతులైన ఇద్దరిని లష్కరే తోయిబాకు చెందిన సాజాద్‌ అహ్మద్‌, రాజా బాసిత్‌ యాకూబ్‌గా గుర్తించామని అధికారులు చెప్పారు. అలాగే పుల్వామా జిల్లాలో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ముష్కరులు హతమైనట్లు కాశ్మీర్ జోన్ పోలీసులు వెల్లడించాయి. ఈ ఆపరేషన్లను స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా చేపట్టాయి. ఇదిలాఉంటే.. శనివారం రాత్రి జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్‌లో మరో ఎన్‌కౌంటర్ జరిగింది.

అనంత్‌నాగ్‌లోని శ్రీగుఫ్వారా ప్రాంతంలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ (ISJK)కి అనుబంధంగా ఉన్న ఒక ఉగ్రవాది హతమైనట్లు కాశ్మీర్ పోలీసులు తెలిపారు. బిజ్‌బెహరా పోలీస్ స్టేషన్‌లోని ఏఎస్‌ఐ మహ్మద్ అష్రాఫ్‌ను హతమార్చడంలో ఈ ఉగ్రవాది ప్రమేయం ఉన్నట్లు కాశ్మీర్ పోలీసు ఇన్‌స్పెక్టర్-జనరల్ తెలిపారు. చనిపోయిన ఉగ్రవాదిని కడిపోరా ప్రాంతానికి చెందిన ఫహీం భట్‌గా గుర్తించారు.

హతమైన ఉగ్రవాది ఇటీవలే ఉగ్రవాద సంస్థ ISJKలో చేరాడని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను కాశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్‌లో వెల్లడించారు. .

Also Read: New Year Recipe: న్యూ ఇయర్ వేడుకల్లో మోజారెల్లా స్టిక్స్ మీ కుటుంబ సభ్యులను ఖుష్ చేయండి.. వీటి ఇలా ట్రై చేయండి..

Horoscope Today: ఈరోజు ఈరాశివారు స్త్రీవలన ఆర్ధికంగా లాభం పొందుతారు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..