IRCTC: ట్రైన్ టికెట్స్ ఇలా క్యాన్సిల్ చేయొద్దు.. మనీ రిటర్న్ రాదు.. తప్పక తెలుసుకోవాల్సిన రూల్స్..

|

Jun 20, 2023 | 10:00 AM

Cancellation and Refund Rules for IRCTC Trains: భారతదేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ ఇండియన్ రైల్వేస్. ప్రతి రోజూ లక్షల మంది ప్రజలు రైళ్లలో ప్రయాణిస్తుంటారు. సురక్షిత, అనుకూలమైనదే కాకుండా.. ఛార్జీల పరంగానూ తక్కువ ధర ఉండటంతో అందరూ సుదూర ప్రయాణాలు సాగించేవారంతా..

IRCTC: ట్రైన్ టికెట్స్ ఇలా క్యాన్సిల్ చేయొద్దు.. మనీ రిటర్న్ రాదు.. తప్పక తెలుసుకోవాల్సిన రూల్స్..
Irctc New Railway Rules
Follow us on

Cancellation and Refund Rules for IRCTC Trains: భారతదేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ ఇండియన్ రైల్వేస్. ప్రతి రోజూ లక్షల మంది ప్రజలు రైళ్లలో ప్రయాణిస్తుంటారు. సురక్షిత, అనుకూలమైనదే కాకుండా.. ఛార్జీల పరంగానూ తక్కువ ధర ఉండటంతో అందరూ సుదూర ప్రయాణాలు సాగించేవారంతా ట్రైన్ జర్నీకే ప్రధాన్యత ఇస్తారు. అయితే, ట్రైన్‌లో లాంగ్ జర్నీ చేయాలంటే.. ముందుగా టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, కొన్నిసార్లు అత్యవసర కారణాల వల్ల బుక్ చేసుకున్న ట్రైన్ టికెట్లను రద్దు చేసుకోవాల్సి వస్తుంది. అయితే, అన్నివేళ టికెట్ రద్దు అనేది సాధ్యపడదు. కొన్నిసార్లు టికెట్ రద్దు చేయడం వల్ల డబ్బులు కోల్పోవాల్సి వస్తుంది. అందుకే, ట్రైన్ టికెట్ రద్దు, డబ్బు వాపసు తీసుకోవడానికి సంబంధించి నియమ నిబంధనలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేస్తే ఎంత డబ్బు రిటర్న్ వస్తుంది?

ఆన్‌లైన్‌లో రైలు టికెట్ బుకింగ్ చేసుకుని, ఏదైనా కారణం చేత దానిని రద్దు చేస్తే.. అందుకు సంబంధించిన డబ్బు తిరిగి అకౌంట్‌లో పడుతుంది. ఐఆర్‌సీటీసీ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో వినియోగదారుల ఖాతాకు డబ్బును పంపుతుంది. అయితే, కొన్ని రకాల ట్రైన్ టికెట్స్ రద్దు చేస్తే మనీ రిటర్న అవ్వదు. ఏ టికెట్లకు మనీ రిటర్న్ రాదో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రైన్ టికెట్ బుక్ చేశాక అది కన్ఫామ్ అవుతుంది. ఆ సమయంలో మీకేదైనా అత్యవసర పని మీద ప్రయాణం క్యాన్సిల్ అయితే, ఆ టికెట్‌ను రద్దు చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. అయితే, టికెట్ రద్దు చేసే సమయంలో కొన్ని అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. వాస్తవానికి టికెట్ రద్దు చేసిన తరువాత రైల్వే నిబంధనల ప్రకారం డబ్బులు రిఫండ్ అవుతాయి. అయితే, నిర్ణీత సమయానికి 4 గంటల ముందు టికెట్ రద్దు చేస్తేనే ఆ డబ్బు రిటర్న్ అవుతుంది. చార్జ్ ప్రిపరేషన్ తరువాత టికెట్ క్యాన్సిల్ చేస్తే మనీ రిటర్న్ అవ్వదు. ఇక కరెంట్‌ టైమ్‌లో టికెట్ తీసుకున్నా.. కన్ఫామ్ అయిన తరువాత క్యాన్సిల్ చేసుకుంటే మనీ రిటర్న్ ఇవ్వబడదు.

ఇవి కూడా చదవండి

ఛార్జ్ చేస్తారు..

ట్రైన్ బయలుదేరడానికి 30 నిమిషాల ముందు టికెట్ రద్దు చేస్తే.. స్లీపర్ క్లాస్‌లో రూ. 60 క్యాన్సలేషన్ ఛార్జెస్ కట్ చేస్తారు. ఇక ఏసీ క్లాస్ టికెట్ రద్దు చేస్తే రూ. 65 ఛార్జెస్ కట్ చేస్తారు. అలాకాకుండా 4 గంటల ముందుగానే రద్దు చేసుకుంటే.. ఎలాంటి ఛార్జీలు కట్ అవ్వకుండా మొత్తం రిఫండ్ అవుతుంది.

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..