రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. అందుబాటులోకి రానున్న ఆ సేవలు.. పూర్తి వివరాలివే

|

Mar 02, 2022 | 8:47 PM

రైల్వే ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ(IRCTC) శుభవార్త చెప్పింది. రైల్వేస్టేషన్లలోని ఆటోమెటిక్‌ టికెట్‌ వెండింగ్‌ మెషిన్‌(ATVM)లలో యూపీఐ పేమెంట్స్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ యూపీఐ పేమెంట్స్‌ కోసం...

రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. అందుబాటులోకి రానున్న ఆ సేవలు.. పూర్తి వివరాలివే
Sabarimala Special Trains
Follow us on

రైల్వే ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ(IRCTC) శుభవార్త చెప్పింది. రైల్వేస్టేషన్లలోని ఆటోమెటిక్‌ టికెట్‌ వెండింగ్‌ మెషిన్‌(ATVM)లలో యూపీఐ పేమెంట్స్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ యూపీఐ పేమెంట్స్‌ కోసం ఐఆర్‌సీటీసీతో భాగస్వామ్యం అయినట్లు పేటీఎం(Paytm) వెల్లడించింది. నగదు రహిత ప్రయాణాన్ని ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా.. ఇండియన్‌ రైల్వే ఏటీవీఎంలలో యూపీఐ పేమెంట్‌ ద్వారా టిక్కెట్ తీసుకునే అవకాశాన్ని తీసుకువచ్చింది. ఏటీవీఎంలపై యూపీఐ ద్వారా డిజిటల్‌గా టిక్కెట్ కొనుగోలు చేసుకునే సౌకర్యం పొందడం ఇదే తొలిసారి కావడం విశేషం. దేశంలో పలు రైల్వే స్టేషన్లలో ఉన్న ఏటీవీఎం యంత్రాలలో ఈ సర్వీసులు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ఏటీవీఎంలు టచ్ స్క్రీన్ ఆధారిత టిక్కెటింగ్ కియోస్క్‌లు. స్మార్ట్ కార్డుల ద్వారా డిజిటల్ పేమెంట్లు చేసుకునే సౌకర్యాలను ప్రయాణికులకు ఈ కియోస్క్‌లు అందిస్తున్నాయి.

వివిధ రకాల టికెట్లను లావాదేవీలను పేటీఎం యూపీఐ, పేటీఎం వాలెట్, పేటీఎం పోస్టుపెయిడ్, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా ప్రయాణికులు తేలికగా చెల్లింపులు చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తూ.. పేటీఎం నిర్ణయం తీసుకుంది. దేశంలో అత్యధిక మంది డిజిటల్ పేమెంట్లు చేస్తుండటంతో.. ఐఆర్‌సీటీసీ భాగస్వామ్యంలో తాము ఈ సర్వీసులు అందజేయడం చాలా సంతోషంగా ఉందని పేటీఎం అధికార ప్రతినిధి చెప్పారు. ఇది పూర్తిగా ప్రయాణికులకు నగదు రహిత సర్వీసులను అందజేయనుందని పేర్కొన్నారు.

Also Read

Janasena-TDP: భీమ్లా నాయక్‌కు టీడీపీ సపోర్ట్ వెనుక ఆంతర్యం అదేనా.. ఆసక్తికర కథనం మీకోసం..!

Pathan: ఎట్టకేలకు ఫ్యాన్స్ నిరీక్షణకు తెరదించిన బాలీవుడ్ బాద్‌షా.. పఠాన్ రిలీజ్‌ డేట్‌ను చెప్పేసిన షారుఖ్‌..

Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు.. వివరాలు సేకరిస్తున్న ఏపీ అధికారులు