ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరూ యోగా చేస్తున్నారు. ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది ఐక్యరాజ్యసమితి. యోగాతో శారీరక, మానసిక వ్యాధులను నయం చేసుకోవచ్చు. పతంజలి మహర్షి ప్రపంచ మానవాళికి అందించిన అపురూపమైన వైద్యకానుక యోగా. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రకటించాలంటూ భారత ప్రభుత్వం 2014లో ఒక ముసాయిదా తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితికి ప్రతిపాదించింది. 175 దేశాలు దీన్ని ఆమోదించాయి. అదే సంవత్సరం డిసెంబరు 11న ప్రధాని మోదీ చొరవతో అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జూన్ 21ని ప్రకటించింది UNO. ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా పగటి సమయం ఎక్కువగా ఉండటం జూన్ 21 ప్రత్యేకత. మైసూర్‌లో యోగా దినోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటుండగా.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో జరగనున్న యోగా దినోత్సవంలో పాల్గొంటారు.
ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హిమాలయ శ్రేణుల్లో తమ ఆసనాలతో యోగా డేలో పాల్గొన్నారు. లడాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిమ్, అరుణాచల్ ప్రదేశ్‌లో ఐటీబీ పోలీసులు యోగాసనాలతో తమ శరీర ధారుఢ్యాన్ని పెంచుకుంటున్నారు. యోగా దినోత్సవం సందర్భంగా ఐటీబీపీ ఓ పాటను రాసి పాడారు.
ఉత్తరాఖండ్ హరిద్వార్‌లో యోగా దినోత్సవం ఘనంగా జరిగింది..రాందేవ్ బాబా ఆశ్రమంలో ప్రత్యేక యోగా కార్యక్రమం నిర్వహించారు..ఇందులో వందల మంది ప్రజలు పాల్గొని ఆసనాలు వేశారు. ఇటు రిషికేశ్‌లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్సింగ్ధామి పాల్గొన్నారు.
యోగా చేస్తే మనసు ఆధీనంలో ఉంటుంది అన్నారు నటసింహ నందమూరి బాలకృష్ణ.అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో నిర్వహించిన యోగా సెలబ్రేషన్స్‌లో బాలయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.యోగా సెలబ్రేషన్స్‌లో పార్టిసిపేట్ చేసిన వారికి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియ చేశారాయన.
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడలో ఏపీ ఆయుష్‌శాఖ యోగా డే నిర్వహించింది..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజనీ హాజరైయ్యారు..ఆపై విద్యార్థులతో కలిసి ఆమె యోగా ఆసనాలు వేశారు.. ప్రతి ఒక్కరూ యోగా చేయాలన్నారు మంత్రి..యోగాతో పాజిటివ్ థింకింగ్ వస్తోందని అన్నారు..మన జీవన శైలిని విదేశీయులు కీర్తిస్తూ ఉంటారని అది భారతదేశ గొప్పతనమన్నారు మంత్రి..
8వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మన ప్రాచీన భారతీయ వారసత్వంలో యోగా ఒక భాగం. యోగా మానవాళికి భారత్ ఇచ్చిన గొప్ప వరం. శరీరం, ఆత్మలను పరిపూర్ణం చేసే అద్భుత సాధనం యోగా’ అంటూ రాష్ట్రపతి చెప్పుకొచ్చారు.
అంతర్జాతీయ యోగా డే వేడుకలను పార్లమెంటు ఆవరణలో నిర్వహించారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో పలు పార్టీలకు అతీతంగా పలువురు ఎంపీలు ఈ కార్యక్రమంలో పాల్గొని యోగా చేశారు.
Delhi | Lok Sabha Speaker Om Birla and other parliamentarians perform Yoga at the premises of the Parliament to mark #InternationalDayofYoga pic.twitter.com/jaxxnYMjpT
— ANI (@ANI) June 21, 2022
హర్యానాలోని కురుక్షేత్రలో జరిగిన యోగా డే వేడుకల్లో కేంద్ర మంత్రి పియూష్ గోయల్ పాల్గొన్నారు. ఉత్సాహంగా యోగాసనాలు వేశారు.
Union Minister Piyush Goyal participates in #InternationalDayofYoga celebrations in Kurukshetra, Haryana. pic.twitter.com/HGpV77kCNG
— ANI (@ANI) June 21, 2022
కొల్‌కత్తాలోని రాజ్‌భవన్‌లో అంతర్జాతీయ యోగా డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్‌దీప్ ధన్కర్ యోగాసనాలు వేశారు.
Kolkata | West Bengal Governor Jagdeep Dhankhar at International Yoga Day celebration at Raj Bhavan organised by Indian Navy pic.twitter.com/lmzkeW4MnX
— ANI (@ANI) June 21, 2022
ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ యోగాసనాలు వేశారు.
Defence Minister Rajnath Singh performs Yoga on the 8th #InternationalDayofYoga
(Source: Rajnath Singh’s Twitter account) pic.twitter.com/fHbe3UayLB
— ANI (@ANI) June 21, 2022
ముంబైలో అంతర్జాతీయ యోగా డే వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద పలువురు ప్రజలు ఉదయాన్నే యోగాసనాలు వేశారు.
Maharashtra | #InternationalDayofYoga celebrations held at the Gateway of India in Mumbai pic.twitter.com/2oMGxf4Q0a
— ANI (@ANI) June 21, 2022
8వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం పర్యాటకులకు శుభవార్త తెలిపారు. ఈరోజు తాజ్ మహల్‌ను సందర్శించే వారు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సోమవారం ఈ విషయాన్ని తెలిపింది. తాజ్‌మహల్‌తో పాటు ఆగ్రా ఫోర్ట్‌లో కూడా ఉచితంగా ఎంట్రీకి అవకాశం ఇచ్చారు.
హైదరాబాద్‌లో జరిగిన యోగా దినోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి జీ.కిషన్ రెడ్డి, స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు తదితరులు పాల్గొని యోగాసనాలు వేశారు.
Telangana | Union Minister G Kishan Reddy, shuttler PV Sindhu and others participate in #InternationalDayofYoga in Hyderabad. pic.twitter.com/LoLLT0fEEC
— ANI (@ANI) June 21, 2022
జమ్ముకశ్మీర్: అమర్నాథ్ గృహ వద్ద బందోబస్తు విధుల్లో ఉన్న భద్రతా బలగాలు మంగళవారం ఉదయం యోగా చేశారు. దాదాపు 450 మంది జవాన్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
J&K | Troops deployed at an altitude of 13000 ft, including at Amarnath holy cave, Brarimarg, Sangam, Baltal and Domel performed Yoga on #InternationalDayofYoga. It was attended by around 450 soldiers at these locations. pic.twitter.com/dPs6NinaiV
— ANI (@ANI) June 21, 2022
తిరువనంతపురంలోని రాజ్ భవన్‌లో యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కేరళ గవర్నర్ అరీఫ్ మొహమ్మెద్ ఖాన్ యోగాసనాలు వేశారు.
Kerala Governor Arif Mohammed Khan participates in #InternationalDayofYoga celebrations at Raj Bhavan in Thiruvananthapuram. pic.twitter.com/zUDX6DkxZ5
— ANI (@ANI) June 21, 2022
ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ హరిద్వార్‌లో తన అనుచరులు 10 వేల మందితో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా యోగాతో ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. యోగా మతపరమైనది కాదని.. ఆధ్యాత్మికమైనదిగా పేర్కొన్నారు.
Uttarakhand | On #InternationalYogaDay, Yog Guru Ramdev performs yoga at Patanjali Yogpeeth in Haridwar. Children and many other people also attend the event. pic.twitter.com/5b4qhrmXxl
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 20, 2022
ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా పలు చోట్ల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.. ప్రధాని నుంచి సాధారణ ప్రజల వరకు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.. యోగా దినోత్సవంలో దేశప్రజలంతా భాగస్వాములై విజయవంతం చేయాలని ప్రధాని మోదీ ట్విటర్ ద్వారా కోరారు. దేశవ్యాప్తంగా 75 నగరాల్లో యోగా వేడుకలు జరుగుతున్నాయి.
అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మంత్రి హరీష్ రావు సిద్ధిపేటలో యోగా కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘యోగా నిత్య జీవితంలో భాగమైందని మంత్రి హరీష్ రావు అన్నారు. కొంత మంది రోగాల బారిన పడ్డాక యోగా చేద్దామని అనుకుంటున్నారని, అలా కాకుండా నిత్యం యోగా చేయడం వాళ్ళ పూర్తి ఆయుష్‌తో నిండు నూరేళ్లు బతుకుతారని తెలిపారు.
మైసూర్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ ప్రజలతో కలిసి యోగాసనాలు చేస్తున్నారు.
యోగా అంటే ఏకాగ్రత సాధించడమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. యోగా ఆత్మవిశ్వాసం కల్పిస్తుందని..
కాలతీతమైనది, ఆచరణయోగ్యమైంది యోగా అంటూ వెంకయ్యనాయుడు చెప్పారు.
యోగా మనల్ని బలవంతులుగా మారుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. యోగా ప్రజలను, దేశాలను కలుపుతుందని తెలిపారు. యోగాతో మొదలైతే ఆ రోజు ఎంతో అద్భుతంగా ఉంటుందన్నారు. ఈ ఏడాది థీమ్ మానవత్వం కోసం యోగా అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. యోగాతో శాంతి వస్తుందని మహర్షులు, ఆచార్యులు చెప్పారని మోడీ అన్నారు. 75 చారిత్రిక ప్రాంతాల్లో యోగా కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామని ప్రధాని స్పష్టం చేశారు. యోగా ఫర్ హ్యుమానిటీ.. ఈ ఏడాది నినాదమని అన్నారు. యోగా మనందరిదీ.. ఏ ఒక్కరిదీ కాదని తెలిపారు. యోగాతో శారీరిక, మానసిక వ్యాధులు నయం అవుతాయన్నారు.
సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లోని యోగా కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు.
యోగా కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, కేంద్ర మంత్రి సర్బానందా సోనోవాలా మైసూర్ ప్యాలస్ చేరుకున్నారు.
Karnataka | Prime Minister Narendra Modi arrives at Mysuru Palace Ground where he will perform Yoga, along with others, on #InternationalDayOfYoga
Union Minister Sarbananda Sonowal, CM Basavaraj Bommai and others are also present here. pic.twitter.com/cfj84smyB6
— ANI (@ANI) June 21, 2022
ఇండో-టిబెటన్ సరిహద్దు పోలీసు సిబ్బంది 14,500 అడుగుల ఎత్తులో యోగా చేస్తున్నారు.
#WATCH | Himveers of Indo-Tibetan Border Police (ITBP) perform Yoga at an altitude of 14,500 feet in Uttarakhand, on the 8th #InternationalDayofYoga
(Source: ITBP) pic.twitter.com/OdYPrzpz09
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 21, 2022
అరుణాచల్ ప్రదేశ్‌లోని లోహిత్‌పూర్‌లో ఇండో-టిబిట్‌న్ పోలీస్ యోగా సాధన చేస్తోన్న దృశ్యాలు.
Arunachal Pradesh | Himveers of Indo-Tibetan Border Police (ITBP) practice yoga at the eastern tip of the nation, ATS, Lohitpur on #InternationalYogaDay pic.twitter.com/0DXD5Ts5BJ
— ANI (@ANI) June 21, 2022
అస్సాం రాజధాని గౌహతిలో బ్రహ్మపుత్ర నది ఒడ్డున సైనికులు యోగా సాధన చేస్తున్నారు.
Assam | 33 Battalion ITBP perform yoga in front of the Brahmaputra River at Lachit Ghat, Guwahati on the occasion of #InternationalYogaDay pic.twitter.com/cKbdQcUd6h
— ANI (@ANI) June 21, 2022