మహిళా దినోత్సవం నాడు గుజరాత్‌కు ప్రధాని మోదీ.. లక్ష మందికి పైగా మహిళలతో భేటీ

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్‌లోని నవ్‌సారీ జిల్లాలోని వంసి-బోర్సిలో 'లఖ్‌పతి దీదీ' కార్యక్రమానికి హాజరవుతారు. 'లఖ్‌పతి దీదీ' కార్యక్రమంలో 1.1 లక్షలకు పైగా మహిళలు పాల్గొంటారని అంచనా. దేశవ్యాప్తంగా కనీసం రెండు కోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా మార్చే లక్ష్యంతో ప్రధానమంత్రి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు

మహిళా దినోత్సవం నాడు గుజరాత్‌కు ప్రధాని మోదీ..  లక్ష మందికి పైగా మహిళలతో భేటీ
Pm Modi

Edited By:

Updated on: Mar 07, 2025 | 12:33 PM

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్‌లోని నవ్‌సారీ జిల్లాలోని వంసి-బోర్సిలో ‘లఖ్‌పతి దీదీ’ కార్యక్రమానికి హాజరవుతారు. ‘లఖ్‌పతి దీదీ’ కార్యక్రమంలో 1.1 లక్షలకు పైగా మహిళలు పాల్గొంటారని అంచనా. దేశవ్యాప్తంగా కనీసం రెండు కోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా మార్చే లక్ష్యంతో ప్రధానమంత్రి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు ఆర్థిక స్వాతంత్ర్యం సాధించడంలో సహాయపడటం ద్వారా వారిని సాధికారపరచడం ‘లఖ్‌పతి దీదీ’ పథకం తీసుకువచ్చింది మోదీ సర్కార్.

ఈ కార్యక్రమం పోలీసింగ్ రంగంలో ఒక కొత్త మైలురాయిని సృష్టిస్తుంది. ఎందుకంటే శాంతిభద్రతల రక్షణతోపాటు అన్ని అంశాలను అలాగే కార్యక్రమ ఏర్పాట్లను మహిళా పోలీసు అధికారులు, సిబ్బంది నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మొత్తం 2,165 మంది మహిళా కానిస్టేబుళ్లు, 187 మంది మహిళా పిఐలు, 61 మంది మహిళా పిఎస్‌ఐలు, 19 మంది మహిళా డివైఎస్‌పిలు, 5 మంది మహిళా డిఎస్‌పిలు, ఒక మహిళా ఐజిపి, ఒక మహిళా ఎడిజిపి మొత్తం కార్యక్రమానికి బాధ్యత వహిస్తున్నారు. ఈ కార్యక్రమం నిర్వహణ సజావుగా జరిగేలా చూస్తారు. ఈ కార్యక్రమాన్ని కేవలం మహిళా పోలీసు అధికారులు, సిబ్బంది నిర్వహిస్తున్నారు.

ప్రతి సంవత్సరం, ప్రపంచం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో విశిష్ట సేవలందించిన మహిళలను గౌరవిస్తుంటారు. లింగ సమానత్వం గురించి అవగాహన పెంచుతుందీ ఆ కార్యక్రమం. మహిళా సాధికారత, న్యాయాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు రాజకీయ విజయాలను కూడా జరుపుకుంటుంది. మహిళల హక్కుల కోసం విద్య, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక స్వాతంత్ర్యం, భద్రతను ప్రోత్సహించే కార్యక్రమాల ద్వారా మహిళలను సాధికారపరచడంలో భారతదేశం గణనీయమైన పురోగతిని సాధించింది.

మహిళా అభివృద్ధి అనే భావన నుండి మహిళా నేతృత్వంలోని అభివృద్ధి వైపు కదులుతూ, కేంద్ర ప్రభుత్వం తన సామాజిక-ఆర్థిక పురోగతిలో మహిళలను కేంద్రంగా ఉంచింది. మార్చి 8వ తేదీ శనివారం, భారత ప్రభుత్వం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ‘మహిళా శక్తితో అభివృద్ధి చెందిన భారతదేశం’ అనే థీమ్‌తో జాతీయ స్థాయి సమావేశాన్ని నిర్వహించనుంది. మహిళా, శిశు అభివృద్ధి మంత్రి అన్నపూర్ణా దేవి, సహాయ మంత్రి సావిత్రి ఠాకూర్, ఇతర సీనియర్ అధికారుల సమక్షంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. యునిసెఫ్, యుఎన్ ఉమెన్ వంటి అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, అలాగే సాయుధ దళాలు, పోలీసులు మరియు వివిధ కీలక రంగాలకు చెందిన మహిళలు కూడా పాల్గొంటారు. జాతి నిర్మాణంలో మహిళల సహకారాన్ని గౌరవించేందుకు #SheBuildsBharat ప్రచారం ప్రారంభించడం జరిగింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ ఛేయండి..