కరోనా నుంచి కోలుకున్న పిల్లల్లోనూ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌

| Edited By:

Oct 10, 2020 | 11:04 AM

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాపై రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ముఖ్యంగా ఈ వైరస్ నుంచి కోలుకున్నప్పటికీ దీర్ఘకాలికంగా

కరోనా నుంచి కోలుకున్న పిల్లల్లోనూ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌
Follow us on

Inflammatory syndrome children: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాపై రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ముఖ్యంగా ఈ వైరస్ నుంచి కోలుకున్నప్పటికీ దీర్ఘకాలికంగా ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని పలు పరిశోధనల్లో తేలింది. అలాగే కరోనా నుంచి కోలుకున్నప్పటికీ కొంతమందిలో ఇతరత్రా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా పెద్దల్లో మల్టీసిస్టమ్‌ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్ వలన కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు, గుండె తదితర అవయాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రక్తంలో గడ్డలు ఏర్పడటం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతోంది.

అయితే పిల్లల్లోనూ ఈ లక్షణాలు కనిపిస్తున్నట్లు వైద్యులు గుర్తించారు. కరోనా నుంచి కోలుకున్న 3 వారాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోందని, కవాసాకి అనే వ్యాధి కూడా పిల్లల్లో కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మల్టీసిస్టమ్‌ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌కి, కవాసాకికి దగ్గర లక్షణాలు ఉన్నాయని వారు అంటున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో  కరోనా నుంచి కోలుకున్న 42 మంది పిల్లల్లో మల్టీ సిస్టం ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌ బారిన పడ్డట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. వారిలో నలుగురు చనిపోయారని వైద్యులు చెబుతున్నారు. ఈ సిండ్రోమ్, కవాసాకిలతో పెద్దగా ప్రమాదం లేకున్నా.. జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు అంటున్నారు. చాలావరకు యాస్పిరిన్, స్టెరాయిడ్స్‌తో ఇది తగ్గిపోతుందని లాన్సెట్‌ అనే ప్రముఖ అంతర్జాతీయ మెడికల్‌ జర్నల్‌ వివరించింది.

పిల్లల్లో సిండ్రోమ్ లక్షణాలు:

జ్వరం, వాంతులు, డయేరియా, కడుపులో నొప్పి, శరీరంపై దద్దుర్లు, కళ్లు ఎర్రగా మారిపోవడం, పెదాలు, నాలుక మరింత ఎర్రగా మారడం లేదా వాపు, నీరసంగా ఉండటం, పాదాలు, చేతులు ఎర్రగా మారడం లేదా వాపు, కొందరిలో ఛాతీ నొప్పి, తీవ్ర నిస్సత్తువ, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, తీవ్రత పెరిగితే పెదాలు, ముఖం నీలం రంగులోకి మారడం, తీవ్రమైన కడుపునొప్పి.

Read More:

కరోనా: ప్రముఖ నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే గ్రహీత పరిస్థితి విషమం

టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టనున్న జవహర్ రెడ్డి