జాలీగా హనీమూన్ వెళ్లిన కొత్త జంట అదృశ్యం.. 11 రోజులకు శవమై కనిపించిన భర్త!
షిల్లాంగ్‌లో హనీమూన్ జంట మిస్సింగ్ మిస్టరీ విషాదాంతమైంది. లోయలో భర్త డెడ్‌బాడీ మాత్రమే దొరికింది. మరి భార్య సంగతేంటి? ఆమె ఎక్కడైనా చిక్కుకుపోయారా? లేదంటే ఎవరైనా కిడ్నాప్ చేశారా? ఇంతకీ భర్తను ఎవరు.. ఎందుకు చంపారు? ఈ అనుమానాలతో పోలీసులు దర్యాప్తు మరింత ముమ్మరం చేశారు.

షిల్లాంగ్‌లో హనీమూన్ జంట మిస్సింగ్ మిస్టరీ విషాదాంతమైంది. లోయలో భర్త డెడ్‌బాడీ మాత్రమే దొరికింది. మరి భార్య సంగతేంటి? ఆమె ఎక్కడైనా చిక్కుకుపోయారా? లేదంటే ఎవరైనా కిడ్నాప్ చేశారా? ఇంతకీ భర్తను ఎవరు.. ఎందుకు చంపారు? ఈ అనుమానాలతో పోలీసులు దర్యాప్తు మరింత ముమ్మరం చేశారు.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కి చెందిన సోనమ్ – రాజా రఘువంశీ.. మే నెల 11వ తేదీన ఘనంగా వివాహం జరిగింది. ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో ఒక్కటయ్యారు. వివాహ మహోత్సవం బంధు మిత్రుల ఆశీర్వాదం మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి తంతు ముగిశాక.. హనీమూన్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు నూతన దంపతులు.
మే 20వ తేదీన ఇంటి నుంచి కొత్త జంట ఆనందంగా బయల్దేరింది. అసోం రాజధాని గౌహతి మీదుగా షిల్లాంగ్ వెళ్లారు. వెళ్లే దారిలో కామాఖ్యా అమ్మవారిని దర్శించుకున్నారు. షిల్లాంగ్‌కి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిరాపుంజిని సందర్శించడానికి యాక్టివాను అద్దెకు తీసుకున్నారు. దట్టమైన అడవిలో ప్రయాణిస్తూ ముందుకెళ్లారు. మరుసటి రోజు సోహ్రారిమ్ గ్రామ సమీపంలో యాక్టివా పడి ఉంది. కానీ దంపతులు మాత్రం కనిపించకుండా పోయారు.
తన బిడ్డతో మే 23వ తేదీన చివరిసారిగా మాట్లాడామని రాజా తల్లిదండ్రులు తెలిపారు. అన్నారు రాజా పేరెంట్స్. ఆ తర్వాత వాళ్ల నుంచి కమ్యూనికేషన్ లేకుండా పోయిందన్నారు. మే 24న వాళ్ల ఫోన్లు స్విచాఫ్ వచ్చాయన్నారు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే మేఘాలయాలోని ఈస్ట్ కాశీ హిల్స్ జిల్లాలో ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా రెండు జంటలు అదృశ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. లేటెస్ట్‌గా సోనమ్ – రాజా కనిపించకుండాపోవడం మిస్టరీగా మారింది.
కంగారుపడ్డ బాధిత కుటుంబం మేఘాలయ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు, బంధువులతో కలిసి సోహ్రా ప్రాంతాలో గాలించింది. అక్కడి అడవులో చూడ్డానికి ఎంత అందంగా ఉంటాయో.. అంతే ప్రమాదకరంగా ఉంటాయని పోలీసులు తెలిపారు. ఓస్రా హిల్‌లో ఆ జంట చివరి లొకేషన్ చూపించింది. అది చాలా ప్రమాదకరమైన ప్రాంతం అంటున్నారు. అక్కడ ఉండే రిసార్ట్‌కు నేర చరిత్ర ఉందని.. దాని సిబ్బందిని విచారిస్తున్నామన్నారు. హనీమూన్ కోసం వెళ్లిన జంట ఆ రిసార్ట్‌లో సేద తీరారా లేదా అన్న కోణంలోనూ ఆరాతీస్తున్నారు. సోనన్- రాజా అద్దెకు తీసుకున్న యాక్టివా నంబర్ ఆధారంగా దాని ఓనర్‌ను కూడా పోలీసులు విచారిస్తున్నారు.
హ్యాపీగా జాలీగా హనీమూన్ వెళ్లిన జంట అదృశ్యం వెనుక ఏం జరిగింది? నగలు, నగదు కోసం ఎవరైనా కిడ్నాప్ చేశారా? లేదంటే స్కూటిపై వెళ్తూ కింద పడిపోయారా? మిస్సింగ్ మిస్టరీ సాధ్యమైనంత త్వరగా ఛేదిస్తామంటున్నారు ఇండోర్ పోలీసులు.
సోనమ్ – రాజా రఘువంశీ.. ఈ కొత్త జంట గత నెల 20న హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లింది. ఆనందోత్సాహాల మధ్య వెళ్లిన జంట కనిపించకుండా పోయింది. ఇవాళో రేపో తిరిగి వస్తారని కుటుంబసభ్యులు ఆశగా ఎదురుచూశారు. కానీ నిరాశే ఎదురైంది. అదృశ్యమైన 11 రోజులకి రఘువంశీ శవమై కనిపించాడు. భార్య సోహ్రాన్ ఎక్కడ ఉన్నారన్నది మిస్టరీగా మారింది.
మే 23న సోహ్రాలోని ఈస్ట్ కాశీహిల్స్‌లో సోహన్ – రఘువంశీ అదృశ్యమయ్యారు. నోంగ్రియాట్ గ్రామంలోని ఓ అతిథిగృహం నుంచి బయటకు వెళ్లిన కొద్ది గంటల్లోనే వీళ్లు కనిపించకుండాపోయారు. అయితో సోహ్రాలోని ఓ జలపాతం సమీపంలో లోతైన లోయల్ రఘువంశీ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. నోంగ్రియాట్ గ్రామంలో పడి ఉన్న టూవీలర్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో డెడ్‌బాడీని గుర్తించి హత్య కేసు నమోదు చేశారు. అదే స్పాట్‌లో సోహ్రాన్ షర్ట్‌ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.
మేఘాలయ పోలీసులు వీసావ్‌డాంగ్ జలపాతం సమీపంలోని లోయలో అనుమానిత హత్య ఆయుధం – డావో (మాచెట్) – తోపాటు మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లోయకు చేరుకున్న NDRF, SDRF, స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ సంయుక్త బృందాలు ని సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు తూర్పు ఖాసీ హిల్స్ పోలీసు సూపరింటెండెంట్ వివేక్ సయీమ్ తెలిపారు.
రఘువంశీని పోగొట్టుకున్నాం.. కానీ సోనమ్‌ను పొగొట్టుకునేందుకు సిద్ధంగా లేమని కుటుంబసభ్యులు అంటున్నారు. ఆమె ఎక్కడ ఉందో ప్రభుత్వం గుర్తించాలన్నారు. సెర్చ్ ఆపరేషన్‌లో సైన్యం సహాయం తీసుకోవాలని కుటుంబసభ్యులు ముందు నుంచి డిమాండ్ చేస్తున్నారు. కానీ ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. రఘువంశీ మృతదేహం కుళ్లిన స్థితిలో ఉండటంతో గుర్తించడం కష్టమైందన్నారు. చేతికి ఉన్న టాటూ, వాచ్‌ని చూసి తమవాడేనని నిర్ధారణకు వచ్చామని కుటుంబసభ్యులు తెలిపారు. అయితే హత్య కేసు మిస్టరీ ఛేదించేందుకు సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశాడు రఘువంశీ సోదరుడు.
మేఘాలయలోని స్థానిక హోటల్ – రెస్టారెంట్ సిబ్బంది, సైడ్‌లు, టూవీలర్లు అద్దెకు ఇచ్చే వ్యక్తులపై బాధిత కుటుంబం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. వాళ్లను పోలీసులు గట్టిగా విచారించాలని కోరుతున్నారు. మరోవైపు పోలీసులు హెలికాప్టర్ల సాయంతో కొండ ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. కొత్త జంటను ఎవరైనా ప్లాన్డ్‌గా ట్రాప్ చేశారా? నగలు, డబ్బు కోసం రఘువంశీని హత్య చేశారా? అదే నిజమైతే.. మరి సోనమ్ ఎక్కడ? ఆమెను కిడ్నాప్ చేశారా అన్న కోణంలో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




