ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం.. గాల్లో 166 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే..

ఈ ఘటనపై ఎయిర్‌పోర్టు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపారు. సాధారణ కార్యకలాపాలను కొనసాగించినట్లు ఇండిగో బోర్డు పేర్కొంది. ఇటీవల అక్టోబర్ 14 న ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. కోల్ కతాకు బయల్దేరిన విమానం అగర్తలా ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ అయింది. టేకాఫ్ అయిన 20 నిమిషాలకే విమానాన్ని పక్షి ఢీ కొట్టడంతో ల్యాండింగ్ చేశారు.

ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం.. గాల్లో 166 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే..
Indigo

Updated on: Oct 22, 2025 | 9:39 PM

ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. కోల్‌కతా నుంచి శ్రీనగర్‌ వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఇండిగో విమానం 6E-6961.. 166 మంది ప్రయాణికులతో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. విమానంలో ఇంధన సమస్య తలెత్తడంతో, పైలట్లు అత్యవసరంగా వారణాసిలోని లాల్‌ బహుదూర్‌ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాన్ని ల్యాండ్‌ చేశారు. విమానంలో ఇంధనం లీక్‌ అయినట్లు గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. విమానంలో ఉన్న 166 మంది ప్రయాణికులను సురక్షితంగా దించారు. ఈ ఘటనపై ఎయిర్‌పోర్టు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపారు. సాధారణ కార్యకలాపాలను కొనసాగించినట్లు ఇండిగో బోర్డు పేర్కొంది.

ఇటీవల అక్టోబర్ 14 న ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. కోల్ కతాకు బయల్దేరిన విమానం అగర్తలా ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ అయింది. టేకాఫ్ అయిన 20 నిమిషాలకే విమానాన్ని పక్షి ఢీ కొట్టడంతో ల్యాండింగ్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..