దేశంలో మొట్టమొదటి తీగల రైల్వే వంతెన సిద్ధం.. ఎక్కడంటే

భారత రైల్వేశాఖ మరో ఘనత సొంతం చేసుకుంది. జమ్ములోని రైసీ జిల్లాలో చేపట్టిన దేశంలో మొట్టమొదటి తీగల రైల్వే వంతెన నిర్మాణం పూర్తైంది. 11 నెలల వ్యవధిలోనే ఈ రైల్వే వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ విషయాన్ని ట్విట్టర్‌లో వెల్లడించారు.

దేశంలో మొట్టమొదటి తీగల రైల్వే వంతెన సిద్ధం.. ఎక్కడంటే
Cable Rail Bridge

Updated on: Apr 30, 2023 | 6:40 AM

భారత రైల్వేశాఖ మరో ఘనత సొంతం చేసుకుంది. జమ్ములోని రైసీ జిల్లాలో చేపట్టిన దేశంలో మొట్టమొదటి తీగల రైల్వే వంతెన నిర్మాణం పూర్తైంది. 11 నెలల వ్యవధిలోనే ఈ రైల్వే వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ విషయాన్ని ట్విట్టర్‌లో వెల్లడించారు. వంతెనను 96 ప్రధాన తీగలతో అనుసంధానించినట్లు పేర్కొన్నారు. ఈ తీగల పొడవు మొత్తం 653 కిలోమీటర్లు ఉందని తెలిపారు. ఆ వంతెనకు సంబంధించిన వీడియోను పోస్టు చేశారు.

అయితే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చేసిన ట్వీట్ పై ప్రధాని మోదీ స్పందించారు. మంత్రి ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ ఎక్స్‌లెంట్ అంటూ ప్రశంసించారు. ఇదిలా ఉండగా దాదాపు రూ.400 కోట్లతో ఈ వంతెన పనులు చేపట్టారు. దీని మొత్తం పొడవు 725 మీటర్లు. అయితే ఈ అంజీఖడ్ తీగల రైల్వే వంతెన జమ్మూ-బారాముల్లా మార్గంలోని కాట్రా- రైసీ సెక్షన్లను కలుపుతుంది. హిమాలయ పర్వతాల నడుమ అంజీఖడ్ నదిపై 1086 అడుగులు ఎత్తులో ఈ వంతెనను నిర్మించారు. ఈ వంతెన సుమారు 216 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలులను కూడా తట్టుకోగలదని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..