India’s Milk Production: తగ్గెదే లే.. డైరీ రంగంలో భారత్‌దే అగ్రస్థానం.. ఇదిగో ఆసక్తికర వివరాలు

భారతదేశం అన్ని రంగాల్లో దూసుకెళ్తోంది.. కరోనావైరస్ వ్యాప్తి తర్వాత కొన్ని రంగాలు మందగించినప్పటికీ.. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో మళ్లీ వేగంగా వృద్ధిలోకి వస్తున్నాయి.. గతంతో పోలిస్తే పశుసంవర్ధక శాఖ, మత్స్య రంగం మళ్లీ పుంజుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి..

India’s Milk Production: తగ్గెదే లే.. డైరీ రంగంలో భారత్‌దే అగ్రస్థానం.. ఇదిగో ఆసక్తికర వివరాలు
India's Milk Production
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 27, 2024 | 3:58 PM

భారతదేశం అన్ని రంగాల్లో దూసుకెళ్తోంది.. కరోనావైరస్ వ్యాప్తి తర్వాత కొన్ని రంగాలు మందగించినప్పటికీ.. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో మళ్లీ వేగంగా వృద్ధిలోకి వస్తున్నాయి.. గతంతో పోలిస్తే పశుసంవర్ధక శాఖ, మత్స్య రంగం మళ్లీ పుంజుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే..గత కొన్నేళ్లుగా డీలాపడుతున్న డైరీ రంగానికి మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చేందుకు.. మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.. ముఖ్యంగా ఈ రంగంలోకి సబ్సిడీ కూడా అందిస్తోంది.. అంతేకాకుండా.. శ్వేత విప్లవం 2.O కు సైతం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.. ఈ క్రమంలోనే కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ ప్రాథమిక పశుసంవర్ధక గణాంకాలను విడుదల చేసింది.

2023-24లో భారతదేశపు పాల ఉత్పత్తి 3.78% పెరిగి.. 239.30 మిలియన్ టన్నులకు చేరుకుంది.. మాంసం – గుడ్డు వరుసగా 4.95%, 3.17% పెరిగాయని కేంద్ర మత్స్య, పశుసంవర్ధక & పాడి పరిశ్రమ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ తెలిపారు.. ప్రాథమిక పశుసంవర్ధక గణాంకాలు (Basic Animal Husbandry Statistics 2024) 2024ను మంగళవారం కేంద్ర మంత్రి విడుదల చేశారు.

పాల వృద్ధి సంవత్సరాలుగా మందగించినప్పటికీ – 2021-22లో 5.77%, 2022-23లో 3.83% మెర పెరిగి.. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా కొనసాగుతోంది. నవంబర్ 26న జాతీయ పాల దినోత్సవం సందర్భంగా BAHS విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాల ఉత్పత్తుల ఎగుమతిని పెంచాల్సిన అవసరాన్ని సింగ్ నొక్కి చెప్పారు.

ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ సహాయ మంత్రి ఎస్పీ సింగ్ బఘెల్, మత్స్యశాఖ సహాయ మంత్రి జార్జ్ కురియన్‌తో పాటు పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అల్కా ఉపాధ్యాయ, అదనపు కార్యదర్శి వర్షా జోషి, ‘అమూల్’ బ్రాండ్ క్రింద పాల ఉత్పత్తులను మార్కెట్ చేసే, గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఎండీ జయేన్ మెహతా తదితరులు పాల్గొన్నారు.

నివేదిక ప్రకారం, “అన్యదేశ/సంకరజాతి పశువుల నుంచి పాల ఉత్పత్తి 8% పెరిగింది.. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 2023-24లో దేశీయ/సాధారణ (నాన్-డిస్క్రిప్ట్) పశువులు 44.76% పెరిగాయి.” అయినప్పటికీ, “గేదెల నుండి పాల ఉత్పత్తి 16% తగ్గింది” అని పేర్కొంది.

2023-24లో మొత్తం గుడ్ల ఉత్పత్తి 3.17% పెరిగి 142.77 బిలియన్లకు చేరుకుందని నివేదిక పేర్కొంది. “గుడ్ల తలసరి లభ్యత సంవత్సరానికి 103 ” అని అది జోడించింది. గుడ్ల ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో 2వ అతిపెద్ద దేశంగా ఉంది.

మాంసం ఉత్పత్తి 4.95% తో వృద్ధి చెందింది. 2023-24లో 10.25 మిలియన్ టన్నులకు చేరుకుంటుందని నివేదిక పేర్కొంది. దేశంలో మొత్తం ఉన్ని ఉత్పత్తి 33.69 మిలియన్ కిలోలుగా ఉంది.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సింగ్ మాట్లాడుతూ.. పాడి రైతులు తమ పశువులకు టీకాలు వేయించాలని కోరారు. ప్రభుత్వం ఉచిత వ్యాక్సిన్‌లను అందుబాటులోకి తెస్తోందని, పాదాలు, నోటి వ్యాధిని 2030 నాటికి నిర్మూలిస్తామని.. ఇది ఎగుమతులను పెంపొందించడానికి సహాయపడుతుంది అని పేర్కొన్నారు.

ప్రతి జంతువుకు సగటు పాల దిగుబడిని పెంచాల్సిన అవసరాన్ని MoS బాగెల్ నొక్కిచెప్పారు. పశుసంవర్ధక శాఖ కార్యదర్శి ఉపాధ్యాయ మాట్లాడుతూ.. భారతదేశ పాడిపరిశ్రమ ప్రపంచ అగ్రగామిగా అవతరించినప్పటికీ.. ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయని అన్నారు.

పాలు నెమ్మదిగా పెరగడం గురించి అడిగిన ప్రశ్నకు GCMMF MD మెహతా మాట్లాడుతూ.. గత 10 సంవత్సరాలలో సగటు వృద్ధి దాదాపు 6% ఉంది.. ఇది ప్రపంచ సగటు కంటే ఎక్కువ. పాల ఉత్పత్తి రుతుపవనాలతో సహా చాలా అంశాలపై ఆధారపడి ఉంటుందని ఆయన చెప్పారు.

ఈ సందర్భంగా జాతీయ గోపాల్ రత్న అవార్డులను (పశుసంపద – పాడి పరిశ్రమలో అత్యున్నతమైన పురస్కారాలు) కూడా ప్రదానం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..