Coal Mining: బొగ్గు ఉత్పత్తిలో చరిత్ర సృష్టించిన భారత్‌! ఎన్ని కోట్ల టన్నులంటే..?

|

Mar 21, 2025 | 2:13 PM

భారతదేశం ఒక బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని అధిగమించింది. ఇది అద్భుతమైన విజయం అని, ఇది దేశం అత్యాధునిక సాంకేతికత, సమర్థవంతమైన మైనింగ్ పద్ధతులకు నిదర్శనం. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, ఆర్థిక వృద్ధికి ఇది తోడ్పడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు.

Coal Mining: బొగ్గు ఉత్పత్తిలో చరిత్ర సృష్టించిన భారత్‌! ఎన్ని కోట్ల టన్నులంటే..?
Coal Pm Modi
Follow us on

బొగ్గు ఉత్పత్తిలో భారత్‌ చరిత్ర సృష్టించింది. ఒక బిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తిని అధిగమించింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు. “1 బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి మైలురాయిని దాటడం ఒక అద్భుతమైన విజయం, ఇది ఇంధన భద్రత, ఆర్థిక వృద్ధి, స్వావలంబన పట్ల మన నిబద్ధతను హైలైట్ చేస్తుంది. ఈ ఘనత సాధించేందకు తోడ్పడిన ప్రతి ఒక్కరి అంకితభావం, కృషిని కూడా ప్రతిబింబిస్తుంది.” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇది నిజంగా ఒక చారిత్మాక మైలురాయిగా చెప్పవచ్చు. ప్రస్తుతం దేశంలో పెరుగుతున్న విద్యుత్‌ వినియోగంతో పాటు ఇతర పారిశ్రామిక అవసరాల కోసం బొగ్గు చాలా ముఖ్యం. అయితే ఈ అవసరాల కోసం మన దేశం ఇతర దేశాలపై ఆధారపడి, అక్కడి నుంచి బొగ్గును దిగుమతి చేసుకుంటోంది. పెరుగుతున్న డిమాండ్‌ నేపథ్యంలో దేశంలోనే ఒక బిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయడం అనేది అసాధారణ విషయంగా చెప్పుకోవచ్చు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.