
ఏప్రిల్ 22 వ తేదీ జమ్మూ కశ్మీర్ లో పహల్గామ్ లో ఉగ్రవాదులు నర మేథం చేశారు. అమాయకులైన పర్యాటకులను మతం అడిగి హిందువులు అని తెలుసుకున్న తర్వత అతి దారుణంగా చంపేశారు. ఈ దారుణ ఘటనపై దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా నిరసన వ్యక్తం అయింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులపై చర్యలు తప్పవని బహిరంగంగా ప్రధాని మోడీ ప్రపంచానికి చాటి చెప్పారు. చెప్పిన విధంగానే భారత వాయుసేన పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఏకకాలంలో తొమ్మిది చోట ఉగ్ర స్థావరాలపై దాడి చేసింది. భారత్ తీసుకున్న చర్యలపై ప్రపంచం వ్యాప్తంగా సపోర్ట్ లభించగా… భారత్ చేపట్టిన ఆపరేషన్‌ను ఖండిస్తూ టర్కీ, అజర్‌బైజాన్ వంటి దేశాలు పాకిస్తాన్ కు సపోర్ట్ గా నిలిచాయి. తాజాగా అజర్‌బైజాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ” పాకిస్తాన్ ప్రజలకు సంఘీభావం ” తెలియజేస్తుందని ఒక ప్రకటన చేసింది.
“భారత, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తత మరింత పెరగడంపై తమ దేశం ఆందోళనను వ్యక్తం చేస్తోంది” అని అజర్‌బైజాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అంతేకాదు పాకిస్తాన్ పై జరిగిన సైనిక దాడులను ఖండిస్తున్నామని వెల్లడించింది. అంతేకాదు ఈ దాడిలో అనేక పాకిస్తాన్ మంది పౌరులు మరణించారు, గాయపడ్డారని.. ప్రజలకు సంఘీభావంగా తాము ఉంటామని చెప్పింది. అమాయక బాధితుల కుటుంబాలకు తాము సంతాపం తెలియజేస్తున్నామని … క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
అజర్‌బైజాన్ ప్రభుత్వం పాక్ కి సంఘీభావం చెప్పడంతో భారతీయులు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అనేక మంది అజర్‌బైజాన్‌పై విరుచుకుపడుతున్నారు. గత కొన్ని ఏళ్లుగా భారతీయులు ఎక్కువగా వెళ్తున్న దేశాల్లో అజర్‌బైజాన్ ఒకటి. దీంతో ఇప్పుడు భారతీయ పర్యాటకులు ఆ దేశాన్ని బహిష్కరించాలని పిలుపునిస్తున్నారు. ఈ సెలవుల్లో ఈ దేశంలో పర్యటించాలని ఆలోచిస్తుంటే ఆ ఆలోచన విరమించుకోండి అంటూ సోషల్ మీడియా వేదికాగా కోరుతున్నారు.
దయచేసి ఇకపై బాకుని సందర్శించ వద్దు. 2024 లో అజర్‌బైజాన్‌కి వెళ్ళే భారతీయ పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే ఇప్పుడు భారతీయ పర్యాటకులు తమ శక్తిని దేశ భక్తిని చూపించండి!” అని మరొకరు పిలుపునిచ్చారు. ఏ దేశభక్తి గల భారతీయుడైనా తన డబ్బును అజర్‌బైజాన్, టర్కీ దేశాల బాగు కోసం ఖర్చు చేయడానికి ఎటువంటి కారణం కనిపించడం లేదని చెబుతూనే.. ఈ దేశాలకు బదులుగా ఈ దేశాల ప్రాంతీయ ప్రత్యర్థులైన అర్మేనియా, గ్రీస్ దేశాలను సందర్శించడానికి ఎంపిక చేసుకోండి అని చెబుతున్నారు.
“భారతదేశం, పాకిస్తాన్‌లకు సంబంధించిన ప్రస్తుత పరిస్థితిలో టర్కీ పాకిస్తాన్ కు సపోర్ట్ గా నిలవడంపై భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టర్కీ భూకంపంలో చిక్కుకుని విల్లాడుతున్నప్పుడు భారత్ చేసిన సాయం మరచింది.. కనుక గోవాలో టర్కిష్ పౌరులకు ఎటువంటి వసతి సేవలను అందించకూడదని తాము నిర్ణయించుకున్నామని గోవా విల్లాస్ యాజమాన్యం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. మేము మా దేశం కోసం బలంగా ,దృఢంగా నిలబడతాము” అని పేర్కొంది.
Due to Turkey’s non-cooperative stance in the current global scenario involving India and Pakistan, we’ve decided not to offer any accommodation services to Turkish citizens in Goa. We stand firmly with our nation.
Jai Hind 🇮🇳
— Goa Villas (@Goavilla_) May 8, 2025
బుధవారం తెల్లవారుజామున, భారత సాయుధ దళాలు పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద లక్ష్యాలపై క్షిపణి దాడులు చేశాయి. వీటిలో జైష్-ఎ-మొహమ్మద్ బలమైన బహవల్పూర్ , లష్కరే-ఎ-తోయిబా స్థావరం మురిద్కే ఉన్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..