Republic Day: రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌

| Edited By: TV9 Telugu

Jan 05, 2024 | 11:36 AM

జనవరి 26న జరిగే గణతంత్ర వేడుకలకు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. 2024లో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరు కావాల్సిందిగా ఫ్రాన్స్ అధ్యక్షుడికి ఆహ్వానం అందింది. రిపబ్లిక్ పరేడ్‌కు మరో నెల రోజుల సమయం ఉండడంతో గణతంత్ర దినోత్సవానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి.

Republic Day: రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌
Pm Narendra Modi Emmanuel Macron
Follow us on

జనవరి 26న జరిగే గణతంత్ర వేడుకలకు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. 2024లో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరు కావాల్సిందిగా ఫ్రాన్స్ అధ్యక్షుడికి ఆహ్వానం అందింది. రిపబ్లిక్ పరేడ్‌కు మరో నెల రోజుల సమయం ఉండడంతో గణతంత్ర దినోత్సవానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి.

జూలై నెలలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ సమావేశమయ్యారు. బాస్టిల్ డే పరేడ్‌లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఫ్రాన్స్ వెళ్లారు. పరేడ్‌లో ఆయన గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ప్రధాని మోదీని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ స్వయంగా ఆహ్వానించారు. భారతదేశం – ఫ్రాన్స్‌ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ ఫ్రాన్స్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మిలిటరీ బ్యాండ్ నేతృత్వంలోని 241 మంది సభ్యులతో కూడిన ట్రై-సర్వీస్ ఇండియన్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ కవాతులో పాల్గొంది.

ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన జీ20 సమావేశంలో పాల్గొనేందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ ఢిల్లీ వచ్చారు. జీ20కి భారత్ ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో, G20 సమావేశం సందర్భంగా, ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ మధ్య ద్వైపాక్షిక సమావేశం కూడా జరిగింది. భారత్-ఫ్రాన్స్ సంబంధాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు పూర్తిగా కట్టుబడి ఉన్నానని సమావేశం అనంతరం ప్రధాని మోదీ చెప్పారు. రక్షణ భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు ఇరువురు నేతలు తమ నిబద్ధతను కూడా వ్యక్తం చేశారు. ఫ్రాన్స్‌ నుంచే భారత్‌ రాఫెల్‌ యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది.

ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ వేడుకలో పాల్గొనడంతో.. ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో ఓ ఫ్రెంచ్ నేత పాల్గొనడం ఇది ఆరోసారి. మాక్రాన్ కంటే ముందు, ఫ్రెంచ్ మాజీ ప్రధాని జాక్వెస్ చిరాక్ 1976, 1998లో భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అతని కంటే ముందు, మాజీ అధ్యక్షులు వాలెరీ గిస్కార్డ్ డి’ఎస్టేయింగ్, నికోలస్ సర్కోజీ, ఫ్రాంకోయిస్ హోలాండ్ వరుసగా 1980, 2008, 2016లో ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…