Bharat Gaurav: వింటర్‌లో ఈశాన్య రాష్ట్రాల ట్రిప్‌ ప్లాన్ చేస్తున్నారా..? ఇండియన్ రైల్వే ప్రత్యేక ప్యాకేజ్..!

రైలు ప్రయాణం అంటే చాలా మంది సరదాగా గడుపుతారు. అందులోనూ సుదూర ప్రాంతాలకు వేసవి సెలవుల్లో గడిపేందుకు ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తారు. అందులోనూ స్నేహితులు, గర్ల్ ఫ్రెండ్స్‌తో వెళ్లేందుకు ఇప్పటి యువత చాలా ఆసక్తి చూపిస్తుంది. కేవలం సమ్మర్లోనే కాకుండా వింటర్లోనూ కొన్ని ప్రాంతాలను సందర్శించేందుకు భారత్ గౌరవ్ రైలు పేరుతోక సువర్ణ అవకాశం కల్పిస్తోంది భారత రైల్వే శాఖ. చలికాలంలో పర్యాటకాన్ని ఆస్వాదించేందుకు సిద్దమైన టూరిస్ట్‌లకు ప్రత్యేకంగా ఒక ప్యాకేజీ

Bharat Gaurav: వింటర్‌లో ఈశాన్య రాష్ట్రాల ట్రిప్‌ ప్లాన్ చేస్తున్నారా..? ఇండియన్ రైల్వే ప్రత్యేక ప్యాకేజ్..!
Indian Railways To Start Bharat Gaurav Train For Northeast States In Winter Season From November 16th

Updated on: Nov 04, 2023 | 1:48 PM

రైలు ప్రయాణం అంటే చాలా మంది సరదాగా గడుపుతారు. అందులోనూ సుదూర ప్రాంతాలకు వేసవి సెలవుల్లో గడిపేందుకు ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తారు. అందులోనూ స్నేహితులు, గర్ల్ ఫ్రెండ్స్‌తో వెళ్లేందుకు ఇప్పటి యువత చాలా ఆసక్తి చూపిస్తుంది. కేవలం సమ్మర్లోనే కాకుండా వింటర్లోనూ కొన్ని ప్రాంతాలను సందర్శించేందుకు భారత్ గౌరవ్ రైలు పేరుతోక సువర్ణ అవకాశం కల్పిస్తోంది భారత రైల్వే శాఖ. చలికాలంలో పర్యాటకాన్ని ఆస్వాదించేందుకు సిద్దమైన టూరిస్ట్‌లకు ప్రత్యేకంగా ఒక ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీలో ఏఏ ప్రాంతాలు కవర్ అవుతాయి. ఎన్నిరోజులు టూర్ ఉంటుంది. వసతి, సౌకర్యాలు ఎలా ఉంటాయో పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

15రోజుల లాంగ్ ట్రిప్..

భారతీయ రైల్వే నవంబర్ 16 నుండి ఈశాన్య రాష్ట్రాల పర్యటన కోసం భారత్ గౌరవ్ రైలును ప్రారంభించనుంది. ఈ రైలు అస్సాంలోని గౌహతి, శివసాగర్, జోర్హాట్, కాజిరంగా, త్రిపురలోని ఉనకోటి, అగర్తల, ఉదయపూర్, నాగాలాండ్‌లోని దిమాపూర్, కోహిమా, మేఘాలయలోని షిల్లాంగ్. చిరపుంజీలను కవర్ చేస్తుంది. ఈ ట్రిప్ 15 రోజుల పాటు ఉంటుందని తెలిపింది. రైల్వే మంత్రిత్వ శాఖ ఐఆర్‌సీటీసీ (IRCTC) సహకారంతో భారత్ గౌరవ్ రైలును ‘నార్త్ ఈస్ట్ డిస్కవరీ టూర్’గా పేర్కొంది. భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలను ప్రోత్సహించడంలో భాగంగా.. భారత్ గౌరవ్ డీలక్స్ ఏసీ టూరిస్ట్ రైలును ప్రత్యేకంగా క్యూరేటెడ్ టూర్ పేరుతో రూపొందించింది. ఈ రైలు 2023 నవంబర్16న ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ రైల్వే స్టేషన్ నుండి ప్రారంభమవుతుందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.

రైలు ప్రత్యేకతలు ఇవే..

భారత్ గౌరవ్ డీలక్స్ ఏసీ టూరిస్ట్ రైలులో రెస్టారెంట్లు, ఫ్లేమ్‌లెస్ కిచెన్, షవర్‌తో పాటూ సెన్సార్ ఆధారిత వాష్‌రూమ్స్, ఫుట్ మసాజర్, మినీ లైబ్రరీ వంటి అనేక సౌకర్యాలు ఉన్నాయి. ఈ రైలులో మూడు రకాల వసతిని అందిస్తుంది. ఏసీ ఫస్ట్, సెకండ్, థర్డ్ క్లాసులు ఉంటాయి. దీంతో పాటూ భద్రత దృష్ట్యా సీసీటీవీ కెమెరాలు, ఎలక్ట్రానిక్ సేఫ్‌లు, ప్రతి కోచ్‌కు సెక్యూరిటీ గార్డులతో కూడిన మెరుగైన ఫీచర్లు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ప్రయాణం ఇలా సాగుతుంది..

అత్యంత అధునాతనమైన హంగులతో కూడిన రైలులో 14 రాత్రులు, 15 రోజుల పాటు ఈ టూర్ సాగుతుంది. ఈ రైలు మొదటి స్టాప్ గౌహతిలో ఉంటుంది, ఇక్కడ పర్యాటకులు కామాఖ్య ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తరువాత ఉమానంద ఆలయంతో పాటూ బ్రహ్మపుత్ర నదిపై సూర్యాస్తమయాన్ని వీక్షించేందుకు అవకాశం కల్పిస్తారు. ఈ సుందర రమణీయ దృశ్యాన్ని వీక్షించిన తరువాత ఈ రైలు అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఇటానగర్‌కు 30 కి.మీ దూరంలో ఉన్న నహర్లాగన్ రైల్వే‌స్టేషన్‌ మీదుగా రాత్రిపూట ప్రయాణిస్తుంది. తదుపరి అస్సాం తూర్పు భాగంలోని అహోం ప్రాంతానికి పాత రాజధాని అయిన శివసాగర్‌లోని ప్రసిద్ధ శివాలయం శివడోల్‌కు చేరుకుంటుంది. దీంతో పాటూ అక్కడి చుట్టుపక్కల ప్రసిద్ద ప్రదేశాలైన తలతల్ ఘర్, రంగ్ ఘర్ (కొలోసియం ఆఫ్ ది ఈస్ట్) వంటి ప్రదేశాలతో పాటు జోర్హాట్‌లోని తేయాకు తోటలను సందర్శించే అవకాశాన్ని కల్పిస్తుంది. చివరగా కజిరంగా నేషనల్ పార్క్‌లో తెల్లవారుజామున జంగిల్ సఫారీతో పాటు కాజిరంగాలో రాత్రిపూట బస చేయడం పర్యాటకులకు మంచి అనుభూతిని కలిగిస్తుంది.

పర్యటించే ప్రదేశాలు ఇవే..

అస్సాం-గౌహతి, శివసాగర్, జోర్హాట్ మరియు కాజిరంగా

త్రిపుర ఉనకోటి, అగర్తల మరియు ఉదయపూర్

నాగాలాండ్ – దిమాపూర్ మరియు కోహిమా

మేఘాలయ షిల్లాంగ్ మరియు చిరపుంజి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..