Indian Railway: రైలు గార్డ్‌ అని పిలవకండి.. ట్రైన్‌ మేనేజర్‌ అని పిలవండి.. కీలక మార్పులు చేసిన రైల్వే శాఖ..!

|

Jan 14, 2022 | 10:13 PM

Indian Railway: ఇండియన్‌ రైల్వే శాఖ ప్రయాణికుల కోసమే కాకుండా రైల్వే శాఖలో ఉన్న ఉద్యోగల విషయంలో కూడా కీలక మార్పులు చేస్తుంటుంది...

Indian Railway: రైలు గార్డ్‌ అని పిలవకండి.. ట్రైన్‌ మేనేజర్‌ అని పిలవండి.. కీలక మార్పులు చేసిన రైల్వే శాఖ..!
Follow us on

Indian Railway: ఇండియన్‌ రైల్వే శాఖ ప్రయాణికుల కోసమే కాకుండా రైల్వే శాఖలో ఉన్న ఉద్యోగల విషయంలో కూడా కీలక మార్పులు చేస్తుంటుంది. ఇక తాజాగా రైలు గార్డు పేరుతు మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది రైల్వేశాఖ. ఇక నుంచి రైలు గార్డు అని పిలవద్దని, గార్డ్‌ పోస్ట్‌ను ట్రైన్‌ మేనేజర్‌ అని మార్చాలని నిర్ణయం తీసుకుంది. అసిస్టెంట్‌ గార్డ్‌ను సీనియర్‌ గూడ్స్‌ ట్రైన్‌ మేనేజర్‌గా, సీనియర్‌ పాసింజర్‌ గార్డ్‌ను సీనియర్‌ పాసింజర్‌ ట్రైన్‌ మేనేజర్‌గా, మెయిల్‌/ఎక్స్‌ప్రెస్‌ గార్డ్‌ను మెయిల్‌/ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ మేనేజర్‌గా వ్యవహరించాలని వెల్లడించింది. ఈ మార్చిన పేర్లు వెంటనే అమల్లోకి వస్తాయని తెలిపింది.

అలాగే పేరు మార్పు కారణంగా వారి వేతనం, నియామక విధానం, ప్రస్తుతం నిర్వహిస్తున్న విధులు, బాధ్యతలు, సీనియారిటీ, పదోన్నతులకు ఎలాంటి సంబంధం లేదని రైల్వే శాఖ వెల్లడించింది.

 

ఇవి కూడా చదవండి:

Credit Card Lock: క్రెడిట్, డెబిట్ కార్డుల‌కు లాక్‌ ఎలా చేయాలి.. కార్డును ఎలా సెట్‌ చేసుకోవాలి..!

Modi Government: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రయాణికులకు మరింత భద్రత

Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఇక నుంచి పోస్టాఫీసుల నుంచి రైలు టికెట్ల బుకింగ్‌..!