Vande Bharat Trains: వందేభారత్ ట్రైన్స్ మొన్న అలా.. నేడు ఇలా.. వీడియో షేర్ చేసిన కేంద్ర మంత్రి..

రైల్వే వ్యవస్థలో మార్పులు చేపడుతూ.. కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖ వందేభారత్ రైళ్లను తీసుకువచ్చాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 8 వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకురాగా,

Vande Bharat Trains: వందేభారత్ ట్రైన్స్ మొన్న అలా.. నేడు ఇలా.. వీడియో షేర్ చేసిన కేంద్ర మంత్రి..
Vande Bharat Trains
Follow us

|

Updated on: Jan 29, 2023 | 7:53 PM

రైల్వే వ్యవస్థలో మార్పులు చేపడుతూ.. కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖ వందేభారత్ రైళ్లను తీసుకువచ్చాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 8 వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకురాగా, అవి నిర్ణీత గమ్యాల మధ్య పరుగులు పెడుతున్నాయి. అయితే, ఈ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు.. ఆ రైళ్లను చెత్తకుండీ కంటే దారుణంగా చేసేస్తున్నారు. వందే భారత్ ట్రైన్ ఒక ట్రిప్ వెళ్లి వచ్చాక.. ట్రైన్ అంతా చెత్తమయం అవుతోంది. ఇదే అంశంపై మీడియాలో వరుస కథనాలు వచ్చాయి. అంతేకాదు.. రైళ్లలో క్లీనింగ్ ప్రాసెస్‌ని మార్చాలంటూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు అనేక ఫిర్యాదు అందాయి. స్పందించిన మంత్రి.. రైల్వే శాఖ అధికారులను తగు చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించారు. దాంతో అలర్ట్ అయిన రైల్వే శాఖ.. వందే భారత్ రైళ్లను పరిశుభ్రంగా ఉంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టింది. ట్రైన్ గమ్యస్థానం చేరాక శుభ్రం చేయడానికి బదులుగా.. ట్రైన్‌లోనే ఎప్పటికప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ చేపట్టింది. ఇందుకు సంబంధించిన వీడియోను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ షేర్ చేయగా.. అదికాస్తా ఇప్పుడు వైరల్‌గా మారింది.

విమానాల్లో క్లీనింగ్ విధానాన్ని అనుసరిస్తున్నట్లుగానే.. వందే భారత్ రైళ్లలోనూ క్లీనింగ్ విధానాన్ని అనుసరించాలని మంత్రి ఆదేశించడంతో.. అధికారులు ఆ విధమైన చర్యలే చేపట్టారు. ట్రైన్‌లో స్వీపర్స్‌ని నియమించింది రైల్వే శాఖ. వారు ప్రయాణికుల నుంచి ఎప్పటికప్పుడు చెత్తను సేకరిస్తూ.. ట్రైన్‌ను పరిశుభ్రంగా ఉంచుతున్నారు. ఇదే విషయాన్ని పేర్కొంటూ కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఓ వీడియోను ట్వీట్ చేశారు. ‘వందేభారత్ రైళ్లలో క్లీనింగ్ సిస్టమ్ మార్చడం జరిగింది. రైళ్లలో పరిశుభ్రతను కాపాడటానికి ప్రజల నుంచి కూడా సహాయసహకారాలు కావాలి.’ అని మంత్రి రిక్వెస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి

మంత్రి షేర్ చేసిన వీడియోలో.. కొందరు క్లీనర్స్ ట్రైన్‌లో తిరుగుతూ.. ప్యాసింజర్ల నుంచి చెత్తను సేకరిస్తున్నారు. తద్వారా ట్రైన్ క్లీన్‌గా ఉండేలా చూస్తున్నారు. అంతకుముందు.. ట్రైన్ గమ్యస్థానం చేరే సమయానికి చెత్తమయం అయిపోయిన దాఖలాలు కనిపించాయి. ప్లాస్టిక్ బాటిల్స్, పార్సిల్ కవర్స్, ఫుడ్ ప్యాకెట్స్, ఇతర చెత్త అంతా రైలు నిండా పడి ఉంది. అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో రైల్వే శాఖ ఇలా క్లీనింగ్ సిస్టమ్‌ను మొత్తం ఛేంజ్ చేసేసింది.

ప్రయాణికులు చెత్తను ట్రైన్‌లో పడేయొద్దని రైల్వే శాఖ కోరింది. ప్రతి బోగిలో డస్ట్‌బిన్ ఏర్పాటు చేయడం జరిగిందని, అందులో చెత్త వేయాలని రిక్వెస్ట్ చేసింది. ప్రతిష్టాత్మకమైన ఈ వందే భారత్ రైలు మనందరిది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని, రైలు శుభ్రంగా ఉంచాలని విజ్ఞప్తి చేసింది రైల్వే శాఖ.

రైల్వే మంత్రి షేర్ చేసిన వీడియో..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో