రైల్వే ప్రయాణికులకు మరో షాక్. ట్రైన్‌లో ప్రయాణికులకు అందించే ఆహారాలు, డ్రింక్స్ ధరలను పెంచుతూ IRCTC నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న ప్రజలకు రైలు ప్రయాణం కూడా ఖర్చు కానుందన్నమాట. అధికారిక సమాచారం ప్రకారం.. ట్రైన్‌లో లభించే ఆహార పదార్థాల ధరను రూ.2 నుండి రూ.25కి పెంచింది. అయితే, ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుండి వెళ్లే రైళ్లకు మాత్రమే రేట్స్ వర్తించనున్నాయి.
ఐఆర్‌సిటిసి రీజినల్ జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్ మాట్లాడుతూ.. ఆహారంలో నాణ్యత, పరిమాణం రెండూ మెరుగయ్యాయని, అందుకే ధరలు పెంచామని చెప్పారు. రోటీ, దోసె, పప్పు, గులాబ్ జామూన్, శాండ్‌విచ్ వంటి అన్ని వస్తువుల ధరలు పెరిగాయి. అయితే స్టేషన్‌లోని ఫుడ్ స్టాల్స్ ధరలను మార్చలేదు. ప్యాంట్రీకార్స్ ఆహార పదార్థాల ధరలు మాత్రమే పెంచారు. అంతేకాదు.. ధరలు పెంచిన 70 ఐటెమ్స్ జాబితాను IRCTC విడుదల చేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..