కోవిడ్ 19 తో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కె.కె. అగర్వాల్ మృతి, పలువురు ప్రముఖుల సంతాపం

| Edited By: Phani CH

May 18, 2021 | 10:39 AM

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ కె.కె.అగర్వాల్ కోవిడ్ 19 తో మరణించారు. ఆయన వయస్సు 62 ఏళ్ళు...

కోవిడ్ 19 తో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కె.కె. అగర్వాల్ మృతి, పలువురు ప్రముఖుల సంతాపం
Dr.k.k.aggarwal
Follow us on

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ కె.కె.అగర్వాల్ కోవిడ్ 19 తో మరణించారు. ఆయన వయస్సు 62 ఏళ్ళు…వారం రోజులుగా ఏయిమ్స్ లో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఇన్నాళ్లూ ఆయన వెంటిలేటర్ పై ఉన్నారని, గత రాత్రి ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని వారు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన అగర్వాల్.. కరోనా వైరస్ పరిస్థితిపై ప్రజల్లో ఎంతో అవగాహనను కల్పించడానికి కృషి చేశారని, తన వీడియోలతో వారిలో చైతన్యం తేగలిగారని, అనేక మంది రోగులకు ఆయన ప్రసంగాలు ధైర్యాన్ని కలిగించాయని ఎయిమ్స్ కు చెందిన ఓ అధికారి తెలిపారు. వీడియోలే కాకుండా పలు విద్యా సంబంధ కార్యక్రమాల ద్వారా దాదాపు 100 మిలియన్లకు పైగా ప్రజలను అగర్వాల్ ఎడ్యుకేట్ చేయగలిగారని ఆయన అన్నారు. తన జీవితాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి గానీ సంతాప పూర్వకంగా కాదని అగర్వాల్ కోరేవారని ఆ ప్రతినిధి తెలిపారు. పాజిటివిటీ గురించిన ఆయన చైతన్య స్ఫూర్తిని ప్రతివారూ తమలో సజీవంగా ఉంచుకోవాలన్నారు.

కార్డియాలజిస్ట్ అయిన అగర్వాల్… హార్ట్ కేర్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా హెడ్ కూడా.. 2005 లో ఆయన డాక్టర్ బీ.సి.రాయ్ అవార్డును, 2010 లో పద్మశ్రీ అవార్డును పొందారు. ఆయన మృతికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తీవ్ర సంతాపం ప్రకటించింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Vijayasai reddy : ‘ప్రజల పట్ల ఏ బాధ్యత లేని మీకు రాజకీయాలెందుకు? .. వాతలు పెట్టినా బుద్ధి రాకపోతే మీ ఖర్మ.!’

Naga Chaitanya Samantha: మ‌రోసారి వెండితెర‌పై రియ‌ల్ క‌పుల్‌.. నాగ్ సినిమాలో స‌మంత‌, నాగ‌చైత‌న్య‌..