Assault on doctors: వైద్యులపై దాడులకు పాల్పడిన వివిధ సంఘటనలపై జూన్ 18 న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) నిరసన నిర్వహిస్తుందని దాని చీఫ్ డాక్టర్ జెఎ జయలాల్ శనివారం తెలిపారు. ఇటీవలి నెలల్లో, ఫ్రంట్‌లైన్స్‌లో పనిచేస్తున్న వైద్యులపై దాడి సంఘటనలు పెరిగాయని, వైద్యులు, ఆరోగ్య కార్యకర్తల రక్షణ కోసం ప్రభుత్వం సిఆర్‌పిసి, ఐపిసి కింద చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారని జయలాల్ అన్నారు. “సిఆర్పిసి మరియు ఐపిసి నిబంధనల ప్రకారం ప్రభుత్వం కేంద్ర రక్షణ చట్టాన్ని ప్రవేశపెట్టాలని అలాగే, అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు తప్పనిసరి భద్రతా నిర్మాణం ఉండేలా చూడాలని మేము కోరుతున్నాము” అని జయలాల్ చెప్పినట్టు ANI వార్తా సంస్థ తెలిపింది.
గత కొన్ని నెలలుగా, అస్సాం, ఉత్తర ప్రదేశ్, కర్ణాటక మరియు పశ్చిమ బెంగాల్ లలో వైద్యులపై దాడి జరిగింది, ఫ్రంట్ లైన్ కార్మికులకు తగిన భద్రత కల్పించడం ప్రభుత్వ కర్తవ్యం అని జయలాల్ అన్నారు. అస్సాం, ఉత్తర ప్రదేశ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌లో కోవిడ్ -19 వార్డుల్లో పనిచేస్తున్న వైద్యులపై దారుణంగా దాడి చేశారు. మహమ్మారితో పోరాడుతున్నప్పుడు ఫ్రంట్‌లైన్ కార్మికులు సురక్షితంగా ఉండేలా చూడటం ప్రభుత్వ బాధ్యత, ”అని ఆయన అన్నారు.
జూన్ 18 న ‘సేవ్ ది సేవియర్స్’ నిరసన చేపడతామని చెప్పారు. ఆ సమయంలో ఆస్పత్రులు సాధారణంగా పనిచేస్తూనే ఉంటాయని జయలాల్ హైలైట్ చేశారు. బ్లాక్ బ్యాడ్జ్‌లు, మాస్క్‌లు, రిబ్బన్లు, షర్టులు ధరించి నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని ఐఎంఎ తన రాష్ట్ర, స్థానిక శాఖలన్నింటినీ కోరింది. ఆరోగ్య సంరక్షణ నిపుణులను లక్ష్యంగా చేసుకుని హింసకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఇది వైద్యులను కోరింది.
‘సేవ్ ది సేవియర్’ నినాదంతో ఆరోగ్య నిపుణులపై దాడికి వ్యతిరేకంగా జూన్ 18 న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) ఆరోగ్య కార్యకర్తల నిరసనకు నాయకత్వం వహిస్తుంది. ఏ ఆస్పత్రులు మూసివేయబడవు. డాక్టర్లు బ్లాక్ బ్యాడ్జ్, బ్లాక్ మాస్క్ లేదా బ్లాక్ షర్ట్ భరిస్తారు ”అని జయలాల్ తెలిపారు.
అస్సాంలోని కోవిడ్ కేర్ సెంటర్ (సిసిసి) లో ఒక వైద్యునీపై ఒక గుంపు దాడి చేసింది. ఇంకో సంఘటనలో, ఒక పేషెంట్ మరణం తరువాత ఆ పేషెంట్ కుటుంబ సభ్యులు కర్ణాటకలో ఒక వైద్యుడిని కొట్టారు. ఇలా దేశవ్యాప్తంగా నిత్యం ఎక్కడో ఒకచోట ఎదో ఘటన జరుగుతూనే ఉంది. వైద్యులపై దాడి ఘటనలపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించడం లేదని డాక్టర్లు భావిస్తున్నారు. తమకు రక్షణ లేకుండా పోతోందని వారు చాలా కాలంగా ప్రభుత్వంతో మొరపెట్టుకుంటున్నారు.
పెళ్లి బాజాల శబ్దాలతో చిర్రెత్తుకొచ్చిన గజరాజు ఏం చేసిందంటే …? యూపీలో పరుగో పరుగు !