7,801 వజ్రాలతో రింగ్‌.. ‘గిన్నెస్‌ రికార్డు’ సాధించిన భారతీయ స్వర్ణకారుడు

| Edited By:

Oct 25, 2020 | 3:17 PM

7,801 వజ్రాలతో ఒక ఉంగరాన్ని చేసి గిన్నెస్‌ రికార్డులకెక్కారు భారతదేశానికి చెందిన కొట్టి శ్రీకాంత్ అనే స్వర్ణకారుడు.

7,801 వజ్రాలతో రింగ్‌.. గిన్నెస్‌ రికార్డు సాధించిన భారతీయ స్వర్ణకారుడు
Follow us on

Indian jeweller Guiness Record: 7,801 వజ్రాలతో ఒక ఉంగరాన్ని చేసి గిన్నెస్‌ రికార్డులకెక్కారు భారతదేశానికి చెందిన కొట్టి శ్రీకాంత్ అనే స్వర్ణకారుడు. పువ్వు ఆకారంలో అది ఉండగా.. ఈ ఉంగర పనులు 2018లో ప్రారంభమైనట్లు ఆయన తెలిపారు. మొదట ఒక పెన్సిల్‌ డ్రాయింగ్ వేశామని, ఆ తరువాత ఈ ఉంగరానికి ఎన్ని వజ్రాలు సరిపోతాయో తెలుసుకునేందుకు కంప్యూటర్ ఎయిడెడ్‌ డిజైన్ చేయించామని పేర్కొన్నారు. ఇక 2019 మార్చిలో రింగ్‌ బేస్‌ తయారు అయ్యిందని.. అదే ఏడాది మే నుంచి వజ్రాలను పొదగడం ప్రారంభించామని ఆయన అన్నారు.

గతేడాది ఆగష్టులో హైదరాబాద్‌లో ఫినిషింగ్‌ టచ్‌ ప్రారంభించామని తెలిపారు. భారతీయ సంప్రదాయంలో పువ్వులకు చాలా ప్రాధాన్యత ఉంది. ఇక్కడ దేవుళ్లను పూలమాలలతో సత్కరిస్తాం. అలాగే పలు కార్యాలకు పువ్వులను ఉపయోగిస్తుంటాం. పువ్వు స్వచ్చతకు గుర్తు. అందుకే దీన్ని తయారుచేసినట్లు శ్రీకాంత్ వెల్లడించారు. గిన్నెస్‌ రికార్డు సాధించినందుకు సంతోషంగా ఉందని, ఇకపై కూడా ఇలాగే తమ ప్రయోగాలు కొనసాగుతాయని తెలిపారు.

Read More:

మోస్ట్ వాంటెడ్‌ అల్‌ ఖైదా సీనియర్ టెర్రరిస్ట్‌ హతం

Official: నాని ‘శ్యామ్‌ సింగరాయ్‌’.. సాయి పల్లవి, కృతి శెట్టి ఫిక్స్‌