Social Media: వెంటనే ఆ కంటెంట్‌ను తొలగించండి.. సోషల్ మీడియా సైట్స్‌కు కేంద్రం ఆదేశాలు
కత్తికి రెండు వైపులా పదును అన్నట్లు సోషల్ మీడియా ద్వారా మంచి, చెడు రెండూ ఉన్నాయి. అయితే ఇటీవల సోషల్ మీడియాలో అశ్లీలత భారీగా పెరుగుతోందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఆడల్ట్ కంటెంట్ విపరీతంగా అప్‌లోడ్ అవుతోంది. ట్విట్టర్, ఫేస్‌బుక్, టెలిగ్రామ్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా సైట్స్‌లో అశ్లీలత రాజ్యమేలుతోంది. ఎవరుపడితే వారు ఎడాపెడ వల్గర్ కంటెంట్‌ను...

రోజురోజుకీ సోషల్ మీడియా విస్తృతి పెరుగుతోంది. ఇంటర్‌నెట్ అందరికీ అందుబాటులోకి రావడం, డేటా ఛార్జీలు భారీగా తగ్గుముఖం పట్టడం, స్మార్ట్ ఫోన్స్ వినియోగం భాగా పెరిగింది. ఇక సోషల్ మీడియా ద్వారా కమ్యునికేషన్ వ్యవస్థలో కూడా సమూలమైన మార్పులు వచ్చాయి. ప్రపంచంలో ఎక్కడో ఉన్న వారు మరెక్కడో ఉన్న వారితో క్షణాల్లో మాట్లాడుకునే వెసులుబాటు లభించింది. అయితే సోషల్ మీడియా ద్వారా ఎన్ని లాభాలు ఉన్నాయో, అన్నే నష్టాలు కూడా ఉన్నాయి.
కత్తికి రెండు వైపులా పదును అన్నట్లు సోషల్ మీడియా ద్వారా మంచి, చెడు రెండూ ఉన్నాయి. అయితే ఇటీవల సోషల్ మీడియాలో అశ్లీలత భారీగా పెరుగుతోందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఆడల్ట్ కంటెంట్ విపరీతంగా అప్‌లోడ్ అవుతోంది. ట్విట్టర్, ఫేస్‌బుక్, టెలిగ్రామ్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా సైట్స్‌లో అశ్లీలత రాజ్యమేలుతోంది. ఎవరుపడితే వారు ఎడాపెడ వల్గర్ కంటెంట్‌ను అప్‌లోడ్ చేస్తున్నారు. అయితే ఇలాంటి కంటెంట్‌ను అరికట్టేందుకు ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే తాజాగా కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది.
సోషల్ మీడియా సైట్స్‌లో అశ్లీలతను తగ్గించే దిశంగా కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కొన్ని సోషల్ మీడియా సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఎక్స్ (ట్విట్టర్), యూట్యూబ్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా సైట్స్‌కు కేంద్రం నోటీసులు పంపించింది. చైల్డ్ సెక్కువల్ అబ్యూస్ మెటిరీయల్‌ను వెంటనే ఆయా సోషల్ మీడియా వేదికల నుంచి తొలగించని కేంద్రం స్పష్టం చేసింది.
There will be ZERO #tolerance for criminal & #harmful content on Indian #Internet. #ITRules under the #ITAct clearly lays down the expectation from #Intermediaries: They cannot host #criminal & harmful content like #CSAM.
If Intermediaries do not act swiftly to clean up such… pic.twitter.com/PRQ9VypbR6
— Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) October 6, 2023
ప్రస్తుతం ఉన్న కంటెంట్‌ను తొలగించడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి వల్గర్ కంటెంట్ సర్క్యూలేట్ అవ్వకుండా కంటెంట్ మోడరేషన్ అల్గారిథమ్‌లు, రిపోర్టింగ్ మెకానిజమ్‌లను అమలు చేయాలని ఆయా సోషల్ మీడియా సైట్స్‌ను కేంద్రం ఆదేశించింది. ఈ నిబంధనలను పాటించని వారిని 2021 రూల్ 3(1)(బి) అండ్ రూల్ 4(4) ఉల్లంఘనగా పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుందని కేంద్రం తెలిపింది. ఒకవేళ నిబంధనలను అతిక్రమిస్తే సెక్షన్ 79 ప్రకారం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..