ముఖ్యంగా కాకరకాయల జ్యూస్ నెల రోజులపాటు రోజూ తీసుకుంటే ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చని నిపుణులు అంటున్నారు. దీనిని ఎలా తయారు చేయాలంటే..
TV9 Telugu
కాకరకాయ రసం తయారు చేయడానికి ముందుగా కాకరకాయ గింజలు తీసి, ముక్కలుగా కోసి, దానికి నీళ్ళు పోసి బ్లెండర్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి
TV9 Telugu
తరువాత దానికి నిమ్మరసం, ఉప్పు కలుపుకోవాలి. అంతే కాకర జ్యూస్ తయారైనట్లే. హోమియోపతి నిపుణుల ప్రకారం కాకరకాయ రసం ఉదయం ఖాళీ కడుపుతో తాగితే మరిన్ని ప్రయోజనాలు పొందొచ్చు
TV9 Telugu
ప్రతిరోజూ ఖాళీ కడుపుతో ఒక గ్లాసు కాకరకాయ రసం తాగడం వల్ల డయాబెటిస్, ఇతర వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది. డయాబెటిక్ పేషెంట్లకు కాకరకాయ రసం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది
TV9 Telugu
ఇది డయాబెటిస్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. కాకరకాయ రసం తాగడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా బలంగా ఉంటుంది. ఇందులో అధిక మొత్తంలో విటమిన్లు, ఫైబర్ ఉంటాయి
TV9 Telugu
దీని కారణంగా కడుపు సంబంధిత సమస్యల నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు. కాకరకాయలో ఉండే లక్షణాలు కాలేయాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడతాయి. ఇది కాలేయం బాగా పనిచేయడానికి సహాయపడుతుంది. ఆరోగ్యాన్ని కూడా బాగా ఉంచుతుంది