Indian Flag Hosting: పాకిస్తాన్ రికార్డును బద్దలు కొట్టిన ఇండియన్స్.. ఏకంగా 78 వేల మంది కలిసి..

|

Apr 24, 2022 | 10:35 PM

Indian Flag Hosting: ఇప్పటి వరకు పాకిస్తాన్ పేరిట ఉన్న గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌ను ఇండియన్స్ బద్దలుకొట్టారు. 78 వేల మందికిపైగా ప్రజలు కలిసి జాతీయ జెండాను

Indian Flag Hosting: పాకిస్తాన్ రికార్డును బద్దలు కొట్టిన ఇండియన్స్.. ఏకంగా 78 వేల మంది కలిసి..
Indian Flag
Follow us on

Indian Flag Hosting: ఇప్పటి వరకు పాకిస్తాన్ పేరిట ఉన్న గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌ను ఇండియన్స్ బద్దలుకొట్టారు. 78 వేల మందికిపైగా ప్రజలు కలిసి జాతీయ జెండాను ఎగురవేయడం ద్వారా ఇది సాధ్యమైంది. బీహార్‌లోని జగదీష్‌పూర్‌లో 78 వేల మందికిపైగా ప్రజలు ఒకేసమయంలో మన జాతీయ జెండాను ఎగురవేశారు. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా 1857లో జరిగిన తిరుగుబాటు నాయకులలో ఒకరైన అప్పటి జగదీష్‌పూర్ పాలకుడు వీర్ కున్వర్ సింగ్ 164వ వర్ధంతి సందర్భంగా, ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు ఆర్కే సింగ్, నిత్యానంద్ రాయ్, ఉపముఖ్యమంత్రులు తార్కిషోర్ ప్రసాద్, రేణు దేవి, సుశీల్ కుమార్ మోదీతో సహా బీహార్‌కు చెందిన బీజేపీ ముఖ్య నేతలు హాజరయ్యారు. స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దాదాపు 78 వేల మందికిపైగా జనాలు పాల్గొని, జాతీయ పతాకాన్ని రెపరెపలాడించారు. ఇదే సమయంలో ‘వందేమాతరం’ గేయాన్ని ఆలపించారు. ఈ ఫీట్‌తో పాకిస్తాన్ ప్రజలు తమ జాతీయ జెండాను రెపరెపలాడించిన 18 ఏళ్ల ప్రపంచ రికార్డును బద్దలు కొట్టేవారు. 2004లో లాహోర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో 56,000 మంది పాకిస్థానీయులు తమ జాతీయ జెండాను రెపరెపలాడించి గతంలో ప్రపంచ రికార్డు నెలకొల్పారు. అయితే, తాజాగా బీహార్‌లో 78 వేల మందికిపైగా ఈ ఫీట్ చేయడంతో ఆదేశ రికార్డ్ బ్రేక్ చేసినట్లయ్యింది.

ఇక ఈ కార్యక్రమాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు పరిశీలించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారిని భౌతికంగా లెక్కించేందుకు ప్రత్యేకంగా బ్యాండ్‌లను అందజేశారు. కెమెరా ద్వారా ట్రాప్‌ను ఏర్పాటు చేశారు.

Also read:

Viral Video: నీటిలో సరదాగా స్విమ్మింగ్ చేస్తున్న పాము.. సడెన్‌గా దూసుకొచ్చిన మొసలి.. షాకింగ్ సీన్ చూస్తే హడలే..!

Viral Video: విమానాశ్రయంలో చిన్నారితో సరదాగా పోలీస్ ఆఫీసర్.. వీడియోకు ఫిదా అయిపోతున్న నెటిజన్లు..!

Love Failure: ‘నా చావు నీ పెళ్లి కానుక, ఐ లవ్ యూ’.. ప్రేయసికి లేఖ రాసిన యువకుడు.. చివరకు..!