భారతీయ వస్త్రధారణలో వచ్చారని రెస్టారంట్‌లోకి నో ఎంట్రీ.. తర్వాత ఏం జరిగిందో చూడండి!

దేశ రాజధాని ఢిల్లీలో ఆశ్చర్యకర ఘటన వెలుగు చూసింది. భారతీయ వస్త్రధారణలో ఒక రెస్ట్రారెంట్‌కు వెళ్లిన జంటకు చేదు అనుభవం ఎదురైంది. ఇండిన్‌ డ్రెసింగ్‌లో వచ్చిన ఆ జంటను రెస్టారెంట్‌లోకి వెళ్లేందుకు సిబ్బంది అనుమతించలేదు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో సదరు రెస్టారెంట్‌ యాజమాన్యంపై నెటిజన్లు మండిపడుతున్నారు.

భారతీయ వస్త్రధారణలో వచ్చారని రెస్టారంట్‌లోకి నో ఎంట్రీ.. తర్వాత ఏం జరిగిందో చూడండి!

Updated on: Aug 08, 2025 | 10:42 PM

దేశ రాజధాని దిల్లీలో ఆశ్చర్యకర ఘటన వెలుగు చూసింది. భారతీయ వస్త్రధారణలో వచ్చిన ఒక జంటను రెస్టారంట్‌లోకి వెళ్లేందుకు అక్కడున్న సిబ్బంది అనుమతించలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వేరేవాళ్లను రెస్టారంట్‌లోకి అనుమతించినప్పటీ తమను మాత్రం రెస్టారెంట్‌ సిబ్బంది లోపలికి అనుమతించలేదని సదురు జంట ఆరోపించారు. అయితే ఈ ఘటనపై స్పందించిన స్థానిక మంత్రి కమిల్ మిశ్రా ఈ విషయాన్ని సీఎం రేఖా గుప్తా దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

ఈ మేరకు మంత్రి మిశ్రా ఎక్స్‌ వేదిక చేసిన ఒక పోస్ట్‌లో ఇలా పేర్కొన్నారు. సీఎం రేఖా గుప్తా ఈ ఘటనను తీవ్రంగా పరిగణించారని, ఘటనపై దర్యాప్తు జరిపి తక్షణ చర్యలకు అధికారులను ఆదేశించారని ఆయన రాసుకొచ్చారు. దాంతో పాటు ఇకపై నగరంలోని రెస్టారంట్‌ యజమానులు కస్టమర్స్‌కు ఎలాంటి షరతులు, నిషేదాజ్ఞలు విధించరని తెలిపారు. భారతీయ దుస్తువులలో వచ్చే కస్టమర్లకు రెస్టారెంట్‌ నిర్వాహకులు స్వాగతాన్ని అంగీకరిస్తారన్నారు.

వీడియో చూడండి..

మరో వైపు ఈ ఘటనపై సదరు రెస్టారెంట్‌ యజమాని స్పందించారు. తమపై రెస్టారెంట్‌పై వచ్చిన ఆరోపణలు నిజం కావని తెలిపారు. ఆ వార్తల్లో వాస్తవం లేదని చెప్పుకొచ్చారు. సదరు జంట రెస్టారెంట్‌లో టేబుల్‌ బుక్‌ చేసుకోలేదని, ఆ కారణంగానే వాళ్లను లోపలికి అనుమతించలేదని ఆయన చెప్పారు. తమ రెస్టారంట్‌లో కస్టమర్లకు ఎలాంటి వస్త్రధారణ విధానం లేదని స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.