Army Soldier kidnapped: సెలవులో ఉన్న ఆర్మీ సైనికుడు కిడ్నాప్‌.. ఆపై హత్య!

|

Sep 18, 2023 | 8:24 AM

భారత ఆర్మీలో పనిచేస్తున్న ఓ సైనికుడిని గుర్తుతెలియని దుండగులు శనివారం అతని ఇంటి నుంచి కిడ్నాప్‌ చేశారు. సెలవులపై ఇంటికి వెళ్లిన ఆర్మీ సైనికుడిని తుపాకీతో బెదిరించి తమ వాహనంలో తీసుకెళ్లారు. ఆ మరుసటి రోజు (ఆదివారం) నుదిటిపై బుల్లెట్‌ గాయంతో గ్రామ సమీపంలో పడిఉన్న సైనికుడి మృతదేహం లభ్యమైంది. గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం..

Army Soldier kidnapped: సెలవులో ఉన్న ఆర్మీ సైనికుడు కిడ్నాప్‌.. ఆపై హత్య!
Soldier Sepoy Serto Thangthang Kom
Follow us on

ఇంఫాల్, సెప్టెంబర్‌ 18: భారత ఆర్మీలో పనిచేస్తున్న ఓ సైనికుడిని గుర్తుతెలియని దుండగులు శనివారం అతని ఇంటి నుంచి కిడ్నాప్‌ చేశారు. సెలవులపై ఇంటికి వెళ్లిన ఆర్మీ సైనికుడిని తుపాకీతో బెదిరించి తమ వాహనంలో తీసుకెళ్లారు. ఆ మరుసటి రోజు (ఆదివారం) నుదిటిపై బుల్లెట్‌ గాయంతో గ్రామ సమీపంలో పడిఉన్న సైనికుడి మృతదేహం లభ్యమైంది. గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. ఈ దారుణ ఘటన మణిపూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..

మణిపూర్‌లోని ఇంఫాల్ వెస్ట్ జిల్లాలో సెర్టో తంగ్‌తంగ్ కోమ్ అనే ఆర్మీ సైనికుడిని అతని ఇంటి నుంచి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి చంపినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. ఆదివారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో అతని మృతదేహం లభ్యమైంది. శనివారం ఉదయం 10 గంటలకు అపహరణ జరిగినట్లు సమాచారం. ఈశాన్య రాష్ట్రంలోని లీమాఖోంగ్ మిలిటరీ స్టేషన్‌లో విధును నిర్వహిస్తోన్న సెర్టో తంగ్‌తంగ్ కోమ్ ఇటీవల సెలవులపై తన స్వగ్రామనికి వెళ్లాడు. కోయ్‌ కిడ్నాప్‌ సమయంలో అతని 10 ఏళ్ల కుమారుడు కూడా ఇంట్లోనే ఉన్నాడు. అతని కుమారుడే ఏకైక ప్రత్యక్ష సాక్షి. బాలుడు, అతని తండ్రి వరండాలో ఉండగా ముగ్గురు వ్యక్తులు వారి ఇంట్లోకి ప్రవేశించి తలపై తుపాకి గురిపెట్టి తెల్లటి వాహనంలో బలవంతంగా ఎక్కించుకుని తీసుకెళ్లినట్లు బాలుడు అధికారులకు తెలిపాడు.

ఈ ఘటనపై అధికారులు మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆదివారం తెల్లవారుజాము వరకు సైనికుడు కోమ్ గురించి ఎటువంటి సమాచార అందలేదు. ఉదయం 9.30 గంటలకు ఇంఫాల్ ఈస్ట్‌లోని సోగోల్‌మాంగ్ PS పరిధిలోని మోంగ్‌జామ్‌కు తూర్పున ఉన్న ఖునింగ్‌థెక్ గ్రామంలో కోమ్ మృతదేహం లభ్యమైంది. కోమ్ గుర్తింపును అతని సోదరుడు, బావ ధృవీకరించారు. సైనికుడి తలపై ఒక బుల్లెట్ గాయం మాత్రమే ఉంది. కోమ్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక రావాల్సి ఉంది. సైనికుడి అంత్యక్రియలు కుటుంబ సభ్యుల కోరిక మేరకు స్వగ్రామంలో నిర్వహించనున్నారు. మృతుడి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.