Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Infiltration Attempt: జమ్మూ అఖ్నూర్ సెక్టార్‌లో భారీ చొరబాటు యత్నం.. తిప్పికొట్టిన భారత సైన్యం

జమ్మూలోని అఖ్నూర్ సెక్టార్‌లో భారీ చొరబాటు ప్రయత్నాన్ని భారత సైన్యం విఫలం చేసింది. అంతర్జాతీయ సరిహద్దులో పాకిస్తాన్ చొరబాటుకు ప్రయత్నించింది. దానిని భారత సైన్యం భగ్నం చేసింది. నలుగురు చొరబాటుదారులు అంతర్జాతీయ సరిహద్దు నుండి వైర్ వైపు వస్తున్నారని గమనించిన ఆర్మీ సైనికులు, ఆ తర్వాత వారిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక చొరబాటుదారుడు మరణించాడు.

Infiltration Attempt: జమ్మూ అఖ్నూర్ సెక్టార్‌లో భారీ చొరబాటు యత్నం.. తిప్పికొట్టిన భారత సైన్యం
Jammu Infiltration Attempt
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 23, 2023 | 11:36 AM

జమ్మూలోని అఖ్నూర్ సెక్టార్‌లో భారీ చొరబాటు ప్రయత్నాన్ని భారత సైన్యం విఫలం చేసింది. అంతర్జాతీయ సరిహద్దులో పాకిస్తాన్ చొరబాటుకు ప్రయత్నించింది. దానిని భారత సైన్యం భగ్నం చేసింది. నలుగురు చొరబాటుదారులు అంతర్జాతీయ సరిహద్దు నుండి వైర్ వైపు వస్తున్నారని గమనించిన ఆర్మీ సైనికులు, ఆ తర్వాత వారిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక చొరబాటుదారుడు మరణించాడు.

గత కొంత కాలంగా చొరబాటుదారులకు పాకిస్తాన్ నుండి పూర్తి మద్దతు లభిస్తోంది. చొరబాటుదారులు అంతర్జాతీయ సరిహద్దు దాటి భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో, భారత సైనికుల దృష్టిని మరల్చడానికి పాకిస్తాన్ సైన్యం కూడా తన పోస్ట్‌లలో ఒకదానికి నిప్పు పెట్టింది. అయితే, పాకిస్తాన్ పన్నాగం పసిగట్టిన భారత సైనికులు వెంటనే చొరబాటుదారులపై కాల్పులు ప్రారంభించారు. ఇందులో ఒక చొరబాటుదారుడు మరణించాడు.

చొరబాటును భారత ఆర్మీ అధికారులు ధృవీకరించారు. డిసెంబర్ 23 తెల్లవారుజామున అంతర్జాతీయ సరిహద్దులో కాపలా కాస్తున్న సైనికులు చొరబాటు ప్రయత్నాన్ని విఫలం చేశారని ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. అఖ్నూర్ సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు నుంచి భారీ ఆయుధాలతో నలుగురు ఉగ్రవాదులు అటువైపు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. అప్పుడు చొరబడిన ఉగ్రవాదులపై సైనికులు కాల్పులు జరిపారు, అందులో చొరబడిన ఉగ్రవాదులలో ఒకరు నేలమీద పడి మరణించారు.

హతమైన ఉగ్రవాది మృతదేహాన్ని అతని సహచరులు అంతర్జాతీయ సరిహద్దుకు అవతలి వైపుకు లాగినట్లు అధికారులు తెలిపారు. నిఘా పరికరాల ద్వారా ఈ ఉగ్రవాదులు రాత్రి వేళ చీకటిలో చొరబడుతున్నట్లు కనిపించిందని ఆయన చెప్పారు. భారతదేశం గుజరాత్ నుండి జమ్మూ వరకు పాకిస్తాన్‌తో అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటుంది. అయితే, మనం జమ్మూ నుండి ముందుకు వెళ్ళిన వెంటనే, కాశ్మీర్ నుండి నియంత్రణ రేఖ LOC ప్రారంభమవుతుంది.

ఇదిలావుంటే, ఇటీవల జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఉగ్రవాదులు రెండు ఆర్మీ వాహనాలపై మెరుపుదాడి చేశారు. దాడి జరిగిన ప్రదేశంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. వారు ఎలా మరణించారు అనే దానిపై ఇంకా అధికారిక సమాచారం వెల్లడి కాలేదు. ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. పోలీసులు విచారణ నిమిత్తం తీసుకెళ్లిన వారిలో మృతదేహాలు లభ్యమైన వారు కూడా ఉన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…