భారత్-చైనా సరిహద్దులో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒకవైపు రెండు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నా.. డ్రాగన్ కంట్రీ భారీగా బలగాలను మోహరిస్తోంది. కొత్త వైమానిక స్థావరాలను నిర్మించడం, విస్తరించడం వంటి చర్యలకు దిగుతోంది. అయితే చైనాకు ధీటుగా భారత్..ఆ ప్రాంతంలో అదనంగా 15వేల మంది సైనికులను రంగంలోకి దించింది. ఇరుదేశాల మధ్య చర్చలు కొనసాగుతున్న సమయంలో ఈ పరిణామాలు జరగడం..సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు ఇటీవల మూడు రోజుల పాటు టిబెట్‌లో పర్యటించారు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్. అరుణాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రదేశాలను సందర్శించి..రాజధాని లాసాలో టిబెట్ సైనికాధుకారులతో భేటీ అయ్యారు.
టిబెట్ శ్రేయస్సు, శాశ్వత స్థిరత్వానికి ప్రాముఖ్యత ఇవ్వాలని..సైనికులు యుద్ధసన్నాహాలను మెరుగుపర్చుకోవాలని కోరారు. ఇరు దేశాల బలగాల మోహరింపు, జిన్‌పింగ్ టిబెట్ పర్యటనతో సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణమేర్పడింది.