Covid-19 Third Wave: కరోనా థర్డ్ వేవ్ ముంచుకొస్తోంది.. రానున్న రోజులు కఠినమైనవే: వీకే పాల్

| Edited By: Rajitha Chanti

Jul 17, 2021 | 2:24 PM

VK Paul on Coronavirus Third Wave: దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభించి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఈ నేపథ్యంలో థర్డ్ వేవ్ ప్రమాదం ముంచుకొస్తోందని.. అందరూ జాగ్రత్తగా

Covid-19 Third Wave: కరోనా థర్డ్ వేవ్ ముంచుకొస్తోంది.. రానున్న రోజులు కఠినమైనవే: వీకే పాల్
V.k.paul
Follow us on

VK Paul on Coronavirus Third Wave: దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభించి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఈ నేపథ్యంలో థర్డ్ వేవ్ ప్రమాదం ముంచుకొస్తోందని.. అందరూ జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చిరించింది. దేశంలో కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని రానున్న 125 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలంటూ నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ హెచ్చరించారు. కరోనాకు వ్యతిరేకంగా భారతదేశం ఇంకా హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించలేదని శుక్రవారం ఆయన వెల్లడించారు. అయితే.. వైరస్‌ సంక్రమణ, వ్యాప్తి అవకాశాలను తోసిపుచ్చలేమని.. రాబోయే 125 రోజులు చాలా క్లిష్టంగా ఉంటాయంటూ ఆయన అభిప్రాయపడ్డారు.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనావైరస్‌ సంక్రమణను అరికట్టాలంటే.. అనుకూలమైన ప్రవర్తను అలవాటు చేసుకోవడం, కఠిన పద్దతులు పాటించడం ద్వారా సాధ్యమవుతుందంటూ ఆయన పేర్కొన్నారు. మనం ఇంకా హెర్డ్‌ ఇమ్యూనిటీని సాధించలేదని.. ప్రస్తుతం వైరస్‌లో కొత్త కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. ముందుగా వాటిని మనం అడ్డుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. అనేక దేశాలలో కోవిడ్ పరిస్థితి మరింత దిగజారిపోతోందని వీకే పాల్ ఆందోళన వ్యక్తంచేశారు. ప్రపంచం థర్డ్‌ వేవ్‌ వైపు పయనిస్తోందంటూ హెచ్చరించారు.

అయితే.. మన దేశంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపర్చుకునేందుకు సెకండ్‌ వేవ్‌, థర్డ్‌ వేవ్ మధ్య ఉన్న సమయాన్ని వినియోగించుకుంటున్నామని తెలిపారు. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికను కూడా జారీ చేసిందని.. దాని నుంచి మనం నేర్చుకోవాలంటూ అభిప్రాయపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇతర దేశాలతో థర్డ్‌ వేవ్ గురించి చర్చిస్తున్నారని.. ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని డాక్టర్‌ పాల్‌ పేర్కొన్నారు.

కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ మాట్లాడుతూ.. పొరుగు దేశాలలో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయన్నారు. మయన్మార్, ఇండోనేషియా, మలేషియా, బంగ్లాదేశ్‌లల్లో కేసులు భారీగా పెరుగుతున్నాయని వెల్లడించారు. ఆయా దేశాల్లో సెకండ్ వేవ్ కన్నా.. థర్డ్‌ వేవ్‌ ప్రభావం అధికంగా ఉందన్నారు.

Also Read:

BS Yediyurappa: ప్రధాని మోదీతో యడియూరప్ప భేటీ.. అనంతరం కీలక వ్యాఖ్యలు చేసిన కర్ణాటక సీఎం

Elephant: ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఏనుగుల ముందుకెళ్లారు.. ఆ తరువాత లుంగీ చేతపట్టి పరుగులు తీశారు.. ఫన్నీ వీడియో..