Ration ATM: ఏటీఎం మిషన్ ద్వారా రేషన్ సరుకులు.. ప్రయోగాత్మకంగా ప్రారంభించిన అధికారులు.. చిత్రాలు..
దేశంలో తొలిసారిగా రేషన్ ఏటీఎంను ప్రయోగాత్మకంగా హర్యానా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పైలట్ ప్రాజక్ట్‌ను గరుగ్రామ్‌లోని ఫరూక్‌నగర్‌లో ప్రారంభించారు.
Ration Atm 5
Follow us
ప్రభుత్వం పంపిణీ చేసే రేషన్ సరుకుల కోసం గంట తరబడి నిలబడే పరిస్థితికి చెల్లుచీటి పడనుంది. అత్యాధునిక పద్దతులను ఉపయోగిస్తూ కొత్త విధానాన్ని తీసుకువస్తోంది ప్రభుత్వం. ఏటీఎం మిషన్ల ద్వారా పేద ప్రజలకు సరుకులను పంపిణీ చేయాలని భావిస్తోంది.
దేశంలో తొలిసారిగా రేషన్ ఏటీఎంను ప్రయోగాత్మకంగా హర్యానా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పైలట్ ప్రాజక్ట్‌ను గరుగ్రామ్‌లోని ఫరూక్‌నగర్‌లో హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా ప్రారంభించారు. ఈ రేషన్ ఏటీఎం ఐదు నుంచి ఏడు నిమిషాల లోపు 70 కిలోల వరకు బియ్యం, గోధుమలు, చిరుధాన్యాలు విడుదల చేస్తుందన్నారు. కాగా ఈ మెషిన్ టచ్‌స్క్రీన్ ద్వారా పని చేస్తుందని మంత్రి దుష్యంత్ చౌతాలా తెలిపారు.
ఈ ఏటీఎం మెషీన్లో బయోమెట్రిక్ వ్యవస్థ ఉంటుందని, దీని ద్వారా బయోమెట్రిక్ ధ్రువీకరణ జరగగానే, లబ్ధిదారునికి ఎంత ధాన్యం లభిస్తుందో లెక్కించి ఆటోమెటిక్‌గా సంచుల్లో నింపేస్తుంది. దీని వలన ప్రజలకు పారదర్శకంగా రేషన్ సరుకులు అందుతాయని, ఈ ప్రాజెక్ట్ ప్రవేశపెట్టడానికి ముఖ్య కారణం ఇదేనంటూ అధికారులు వెల్లడించారు.
రేషన్ డీలర్లకు ప్రభుత్వం కొత్త నిబంధన బయోమెట్రిక్ సిస్టమ్ తీసుకువచ్చింది. గతంలో రేషన్ ఒక్కటి మాత్రమే వేలిముద్ర వేయడానికి సరిపోయింది. కానీ, ఇప్పుడు లబ్ధిదారులు ఎన్ని వస్తువులు ఇచ్చినా అన్ని వస్తువుల వేలిముద్ర వేయాలి అనే నిబంధన విధించింది.
దీనిని ఆటోమేటెడ్ మల్టీ కమోడిటీ ధాన్యం పంపిణీ యంత్రంగా ఉపయోగపడుతుంది. ఇది దేశంలోనే మొట్టమొదటి రేషన్ ఏటీఎం కాగా.. ఈ పైలట్ ప్రాజెక్ట్ ఫరూకనగర్‌లో విజయవంతంగా నిర్వహించిన అనంతరం యూఎన్ ప్రపంచ ఆహార కార్యక్రమం క్రింద వీటిని త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు హర్యానా ప్రభుత్వం తెలిపింది. ఈ ఏటీఎంలో రేషన్ సరుకులు.. గోధుమలు, ధాన్యం, చిరుధాన్యాలు సరఫరా చేసేలా కార్యాచరణ రూపొందించామన్నారు
ప్రభుత్వం పంపిణీ చేసే రేషన్ సరుకుల కోసం గంట తరబడి నిలబడే పరిస్థితికి చెల్లుచీటి పడనుంది. అత్యాధునిక పద్దతులను ఉపయోగిస్తూ కొత్త విధానాన్ని తీసుకువస్తోంది ప్రభుత్వం. ఏటీఎం మిషన్ల ద్వారా పేద ప్రజలకు సరుకులను పంపిణీ చేయాలని భావిస్తోంది.